స్కూల్, కాలేజీ పిల్లల తీరు చూస్తుంటాం... 17 మార్కులు వస్తే ఆ 1ని 7గా దిద్దేసి పేరెంట్స్ ను మాయ చేస్తుంటారు.. 19 మార్కులు వస్తే 79 వచ్చాయని చెప్పి మోసం చేస్తుంటారు. అబ్బా మా పిల్లాడు బాగానే చదూతున్నాడని పేరెంట్స్ సంతోషపడతారు కానీ ఎకాడమిక్ చివరి పరీక్షల్లో వారి అసలురంగు బయటపడుతుంది. ఎప్పుడూ వచ్చే ఆ మార్కులే వస్తాయి... పరీక్ష తప్పుతాడు.. అప్పుడు నిజం తెలుసుకున్న తల్లిదండ్రులు సైతం బాధపడడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఇన్నాళ్లూ తప్పుడు వార్తలు.. తప్పుడు కథనాలు.. అలవిమాలిన ఎలివేషన్ లతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అత్యంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. సీఎం వైయస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిపథకాలు జనంలోకి చొచ్చుకుపోవడంతో టీడీపీ పునాదులు కదిలిపోయాయి. ఇటీవల వచ్చిన టైమ్స్ నౌ, ఇతర సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, దాదాపు 50 శాతం ఓట్లతో 24-25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని వెల్లడించగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ 49 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా, టీడీపీ జనసేనకలిపి 41 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎదురులేని మెజారిటీ సాధ్యం అవుతుందని, టీడీపీ జనసేన కలిసినా ఫ్యాన్ ముందు కనీసం నిలిచే అవకాశం కూడా లేదని సర్వేలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సర్వేలు మొత్తం ఇలా ఉంటే క్యాడర్లో పూర్తిగా నిస్తేజం అలముకుంది.
సర్వే పేరిట క్యాడర్ ను నిలబెడదాం..
ఇక వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బెంబేలెత్తిన టీడీపీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ఒక కొత్త, సొంత సర్వేను తయారు చేయించి తెలుగుదేశం విడుదల చేసింది. అందులో భాగంగా India TV -CNX పేరిట విడుదలైన ఈ సర్వేలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 46శాతం ఓట్లతో 15 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలుగుదేశానికి 42శాతం ఓట్లతో 10 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే చెప్పినట్లు టీడీపీ చెప్పుకుంటోంది. తమకు గతంలో కేవలం మూడే ఎంపీ సీట్లు తెచ్చుకుని కుదేలైన టీడీపీకి ఇప్పుడు ఏకంగా 10 సీట్లు వస్తాయని ఆ సర్వే చెబుతోంది.
అభ్యర్థులే కరువు.. పది ఎంపి సీట్లు ఎలా ?
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశానికి దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు లేరు. ఇక ఎంపీ టికెట్ అడిగేవారు లేనేలేదు. పోటీకి ససేమిరా అంటున్నారు. సీఎం వైయస్ జగన్ దూకుడు ముందు నిలిచే ధైర్యం లేక పోటీకి సైతం రాం.. రాం..అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీకి పది ఎంపీసీట్లు ఎలా వస్తాయి..ఈ సర్వే మొత్తం ఓ సొంత వంటకం మాదిరి ఉంది..కేవలం క్యాడర్ను నిద్ర లేపడానికి ఈ సర్వే సొంతంగా విడుదల చేశారు తప్ప అందులో వాస్తవం లేదన్నది క్యాడర్ సైతం అంగీకరిస్తున్నారు.
ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయి, ఇచ్చిన మాట, చేసిన హామీలను గాలికి వదిలేసే పార్టీగా ప్రజల్లో చీదరింపునకు గురైన తెలుగుదేశాన్ని కార్యకర్తలు సైతం మెల్లగా త్యజిస్తున్నారు. దీంతో చంద్రబాబు, ఆయన చెంచాలు ఎప్పటిమాదిరిగానే సొంత మీడియాలో భారీగా ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే సర్వేలను సైతం తారుమారు చేసేస్తూ సొంత సర్వేలను ప్రకటించుకుని ప్రజలను ఏమారుస్తున్నారు.