చుట్టూ చీకట్లు..దారి తెన్నూ తెలియని ప్రయాణం.. ఎటు వెళుతుందో తెలియని మార్గం.. ఈ పరిస్థితుల్లో ఎవరిని
నిందించాలో తెలియదు..దీనికి ముగింపు ఎక్కడో తెలియదు. అందుకే ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగుదేశం నాయకులు సోయతప్పి కామెంట్లు చేస్తున్నారు. దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విశాఖ టిడిపి నాయకుడు బండారు సత్యనరాయణమూర్తి మంత్రి రోజా మీద చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. మహిళా మంత్రిని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో దూషిస్తూ ఘన కార్యం చేసినట్లు విర్రవీగడం చూస్తుంటే పార్టీ
ఏ వైపు పయనిస్తోంది .. నాయకుల వ్యవహారశైలి ఇలా మారిందేమి అనే సందేహాలు కలుగుతున్నాయి.
దిక్కు దివాణం లేని టీడీపీ
పార్టీ పెద్దదిక్కు చంద్రబాబు జైల్లో ఉన్నారు. యువనేత లోకేష్ పరారీలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు ఉన్నాడో లేదో తెలీదు. సీనియర్లు యనమల.. కెఈ కృష్ణమూర్తి వంటివారు సైలెంట్ అయ్యారు. ఇక జిల్లాల్లో క్యాడర్ సైతం గప్ చుప్ అయ్యారు. పార్టీకి దిశానిర్దేశం లేక జాతరలో దారితప్పిన పిల్లాడిలా మారింది. ఈ తరుణంలో చంద్రబాబుకు, భువనేశ్వరి, బ్రహ్మణి వంటివారి దృష్టిలో పడేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేయడానికి బండారు వంటివారు తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. బాలకృష్ణ వంటి సంస్కారవంతైన నాయకుడిని రోజా విమర్శిస్తూ మాట్లాడతారా అంటూ బండారు తమ నాయకుడు బాలయ్యను వెనకేసుకు రావడం చూస్తుంటే ఆయనకు బాలయ్య లోని అజ్ఞానం కనిపించలేదు అనిపిస్తోంది. ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి..కడుపైనా చేయాలి అని బహిరంగంగా మాట్లాడిన బాలయ్యను సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పడం ద్వారా బండారు తన గులాంగిరీ స్థాయిని బయటపెట్టకున్నారు.
ఇలాగైనా ఎలాగైనా చంద్రబాబు కుటుంబం ఆశీస్సులు పొందాలన్న ఆతృతతో బండారు.. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతూ తమ నోటి దురద తీర్చుకుంటున్నారు. పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మీదనే ఇలా రౌడీ భాషలో దాడులు చేస్తుంటే మామూలు మహిళలకు వీళ్ళు ఎలాంటి గౌరవం ఇస్తారు ? అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తోంది.