Advertisementt

అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజం !!

Thu 21st Sep 2023 12:40 PM
balakrishna  అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజం !!
TDP members ruckus in the House in support of Babu!! అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజం !!
Advertisement
Ads by CJ

వందల కోట్లు మింగి చట్టానికి దొరికిపోయిన తమ నాయకుడి అరెస్టు అంశం నుంచి సాధ్యమైనంతవరకు సానుభూతిని పొందేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. వెయ్యి ఏనుగులను తిన్న అనకొండ ఇప్పటికి చట్టానికి చిక్కింది అని జనం నవ్వుకున్నారు.

నిన్నమొన్నటి వరకూ గ్రామాల్లో డబ్బులిచ్చి జనాలను పోగేసి ఉత్తుత్తి ధర్నాలు చేయించిన టిడిపి పెద్దలు ఆఖరుకు చిన్నపిల్లల్ని కూడా తమ స్వార్థానికి వాడుకుని ధర్నాలు..దీక్షలు చేయించారు. అయినా మైలేజీ రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నారు. 

ముందస్తు ప్లాన్ !!బాబు డైరెక్షన్*

అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే జైల్లో ములాఖాత్ కు వెళ్ళిన బాలయ్య, యనమల వంటివారికి సభలో ఎలా గలాటా చేయాలన్నది బాబు డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా మొన్న లోకేష్ సైతం ఢిల్లీ నుంచి తమ శాసన సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు.ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి. ఏమేం చేస్తే మంచి ప్రచారం వస్తుంది. అన్నది ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రకారమే బాలయ్య బాబు అసెంబ్లీలో తొడగొట్టి..మీసం తిప్పి హంగామా చేశారు. ఆయనకు సామాజిక అంశాల మీద పట్టులేదు. మాట్లాడే నేర్పు లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలిసిన విద్య.. సులువుగా వచ్చే విద్య ఒక్కటే.. మీసం తిప్పడం . తొడగొట్టడం.. ఇదంతా కలిసి తమ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవచ్చు అనేది వారి ప్లాన్. 

వందల కోట్ల నిధులను మింగేసి చట్టానికి దొరికిన తమ నాయకుడి విషయంలో సానుభూతి పోగేసేందుకు టిడిపి పడరాని పాట్లు పడుతోంది. చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు సభా నిబంధనలకు విరుద్ధం . అయినా సరే అధినేత ప్రాపకం కోసం తప్పని ప్రయత్నం. 

కొత్త బిచ్చగాడు పొద్దేరగడు అన్నట్లుగా మొన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకు ఎక్కి పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం ఇక్కడ గమనార్హం. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ నుంచి సాధ్యమైనంత లబ్ధి పిండుకునెందుకు టిడిపి ఆపసోపాలు పడుతోంది.

TDP members ruckus in the House in support of Babu!!:

Balakrishna who turned his mustache !!

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ