Advertisementt

విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే విజ్ఞత

Fri 08th Sep 2023 01:23 PM
michael kremer  విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే విజ్ఞత
Professor Michael Kremer and Team lauded Andhra Pradesh Education reforms విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే విజ్ఞత
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ లో విద్య సంస్కరణలు.. విద్యా వికాసానికి .. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, బాధ్యత ఖండాంతరాల్లోని మేధావులు, నిపుణులు, విద్యావేత్తలను అబ్బురపరుస్తుంది. 

ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐరాస సదస్సులో పాల్గొని తమ మేథోపటిమను విశ్వవ్యాప్తం చేశారు. ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లి కొత్తవాళ్లతో మాట్లాడడమే గగనం. వారిలోని ఆత్మన్యూనతాభావం వారి నోటిని కట్టేస్తుంది. కానీ మన విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద, ముఖ్యమంత్రి ముందు సైతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తూ వీళ్ళు గరీబోళ్ల పిల్లలేనా ? ఔరా అని అందరూ చెక్కిట వేలుపెట్టుకుని ఆలోచించాల్సిన పరిస్థితికి ఎదిగారు. దీనంతటికీ ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ తీసుకున్న శ్రద్ధ ప్రధాన కారణం. 

ఏదో పథకం మొదలెట్టాం.. అదే నడుస్తుంది కదా అన్నట్టుగా కాకుండా సీఎం వైయస్ జగన్. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలను తన సొంత బిడ్డల మాదిరి భావించి వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర్నుంచి తినే తిండి వరకు.. మోసే బ్యాగ్ నుంచి టాయిలెట్ల వరకూ అన్నీ దగ్గరుండి, ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఎంపిక చేసి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాల మాదిరి తీర్చిదిద్దిన జగన్ మోహన్ రెడ్డి పాలనకు వివిధ రాష్ట్రాలు ముచ్చటపడ్డాయి. మేమూ మీలాగే చేస్తాం అంటూ మన రాష్ట్రానికి వచ్చి పాఠశాలలను చూసి వెళ్లాయి. ఇక ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్డ్ క్రేమెర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పని తీరు చూసి మెచ్చుకున్నారు. 

డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రేమెర్ మన రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు . పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను  చూసి ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని అయన కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ళముందు కనిపిస్తున్న ఓ మార్పు అని ఆయన ఏపీలో విద్యశాఖలో జరిగిన సంస్కరణలను, సీఎం జగన్ ని వేయినోళ్ల పొగిడేశారు. 

Professor Michael Kremer and Team lauded Andhra Pradesh Education reforms:

Michael Kremer and Team lauded Andhra Pradesh Education reforms, call them revolutionar

Tags:   MICHAEL KREMER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ