Advertisementt

అప్పుడు పుంగనూరు-ఇప్పుడు భీమవరం

Wed 06th Sep 2023 01:44 PM
bhimavaram  అప్పుడు పుంగనూరు-ఇప్పుడు భీమవరం
Then Punganur-now Bhimavaram అప్పుడు పుంగనూరు-ఇప్పుడు భీమవరం
Advertisement

నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాటించే సూత్రం ఎలాగైనా గెలవాలి, గెలిచేందుకు ఏమైనా చెయ్యాలి.. ఇన్నాళ్లుగా ఆయన ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తున్నారు.. ఇకముందు కూడా అదే పాలసీ ఫాలో అవుతారు. లోకేష్ కూడా ఇదే మార్గంలో నడుస్తున్నారు.. అంటూ వైసీపీ నేతలు లోకేష్, చంద్రబాబులపై ఫైర్ అవుతున్నారు. 

ఎమ్మెల్యేగా గెలవలేని, మూడుశాఖల మాజీమంత్రి ఇప్పుడు ప్రజల్ని బెదిరించి, కార్యకర్తలను ఉసిగొల్పి వీరత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. మొన్న పుంగనూరులో నేడు భీమవరంలో అందులో భాగంగానే అల్లర్లకు ప్లాన్ చేశారు అంటూ ఆగ్రహిస్తున్నారు. అప్పుడు పుంగనూరు టౌన్లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుకోకుండా పోలీసులను దాటుకుని నగరంలోకి ప్రవేశించాలన్న చంద్రబాబు వలన పలువురు పోలీసులు గాయపడ్డారు. తన్నండి.. పోలీసులకు కొట్టండి అని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ హింసకు ఆజ్యం పోసిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ అల్లర్లలో వందలాది మంది టిడిపి కార్యకర్తలు కేసులపాలయ్యారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆస్పత్రిపాలయ్యారు. 

ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలతో వైసిపి కార్యకర్తలమీద విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడులు చేశారు. సీఎం ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు.. అరుపులతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. 

అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసిపి కార్యకర్తలు సైతం భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ దాదాగిరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కేవలం హింసను ప్రేరేపించి హీరో అవ్వాలని చూస్తున్న లోకేష్ ఈ మేరకు భాషను సైతం అలాగే వాడుతున్నారు. ఒక్కోడ్ని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను అంటూ బెదిరిస్తూ తమ కార్యకర్తలను రౌడీల మాదిరి రెచ్చగొడుతున్నారు అంటూ లోకేష్ భాషపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అంటూ లోకేష్ ఇచ్చిన బూస్ట్ ను చూసి టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు ప్రజల్లో తమ పార్టీకి ఉన్న పరపతి రోజురోజుకూ తగ్గిపోతుండడంతో గూండాగిరీని నమ్ముకుని ప్రజల్లో నిలవాలని తండ్రి చేసినట్లుగానే ఇప్పుడు లోకేష్ కూడా చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.. అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు భీమవరంలో జరిగిన అల్లర్లని వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Then Punganur-now Bhimavaram:

Another Punganur in Bhimavaram.. | Tdp activists attacks

Tags:   BHIMAVARAM
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement