Advertisementt

కోడ్ భాషలో రూ. కోట్లు కుమ్మేశారు ..

Tue 05th Sep 2023 09:22 AM
chandrababu naidu  కోడ్ భాషలో రూ. కోట్లు కుమ్మేశారు ..
In code language Rs. Crores have fallen.. కోడ్ భాషలో రూ. కోట్లు కుమ్మేశారు ..
Advertisement
Ads by CJ

చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా కోడ్ భాష వాడి రూ.కోట్లు కొట్టేసింది అనే ఆరోపణలు మొదలయ్యాయి. రూ. 8వేలకోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ-పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు రూపేణా చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు తీసుకున్నారు అంటూ ప్రముఖ వార్త పత్రిక కథనంతో పాటుగా వైసీపీ ఆరోపిస్తుంది. ఆయితే ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు అంతా కోడ్ భాషను వినియోగించారు అంటున్నారు. 

డబ్బును ఏయే ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలన్న దానికి సంబంధించి పగడ్బందీగా ఉండేలా ఒక కోడ్ భాషను ఉపయోగించారట. హైదరాబాద్ లోని  వారికీ డబ్బు వేయాలంటే HYD అని, విజయవాడలోని తమ అనుయాయులకు పంపాలి అంటే విజయ్ అని, విశాఖలోని వారికి పంపాలి అంటే విష్ అని, బెంగళూరు వారికి ఐతే బాంగ్ అని వారిమధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచిందని తెలుస్తోంది. దీంతోబాటు ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. స్టీల్ అని అన్నారు.. స్టీల్ అంటే డబ్బు అని.. చెబుతూ దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు. టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారు అంటూ వైసీపీ ఫైర్ అవుతుంది. 

సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ వైసీపీ వాదిస్తోంది. 

చంద్రబాబు సదరు సంస్థలనుంచి ముడుపులు తీసుకున్న వ్యవహారం గుర్తించిన ఐటి అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వగా దానికి అయన సమాధానం ఇవ్వకపోగా ఎదురు రుబాబు చేస్తూ.. మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండి, నాకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ కు లేదని, సెంట్రల్ కార్యాలయానికి ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారని  అంటూ ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయాణం చేశారట. ఈ మేరకు అయన 2022 అక్టోబర్ 10,  27న...  2023, జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపుపన్ను శాఖవారికి లేఖలు రాశారు . 

అధికారుల నుంచి కూడా చంద్రబాబుకి కూడా గట్టిగానే సమాధానమిచ్చారట. మేము అన్ని రకాల ఆధారాలతోనే ఈ నోటీసు లు ఇచ్చామని అధికారులు చంద్రబాబుకి చెప్పినట్లుగా తెలుస్తుంది. దాదాపు 46 పేజీల నోటీసులు చంద్రాబబుకి అధికారులు పంపించినట్లుగా తెలుస్తోంది. 

In code language Rs. Crores have fallen..:

IT Notice to TDP Chief Chandrababu Naidu

Tags:   CHANDRABABU NAIDU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ