ఏపీలో 2019 లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలోని వారంతా అధికార పక్షంలోకి చెరిపోవడంతో.. టీడీపీ కి బలమైన నేతలు కరువయ్యారు. అటు చంద్రబాబు కూడా కొన్నాళ్లుగా సైలెంట్ గానే ఉండి.. మళ్ళీ 2024 ఎన్నికల కోసం టీడీపీని సిద్ధం చెయ్యడానికి రెడీ అయ్యారు. కానీ ఈసారి చంద్రబాబు మాటలని నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు కూడా కనిపించడం లేదు. పెద్దాయన అన్ని నాకే తెలుసు అన్ని నేనే చేశా అంటూ చెప్పుకోవడమే కానీ.. అధికారంలోకి వస్తే తానేం చేస్తానో చెప్పలేకపోతున్నారంటూ వైసీపీ నేతలు గట్టిగానే విమర్శిస్తున్నారు.
ఇక నిన్న చంద్రబాబు నాయుడు విజనరీ 2047 మీటింగ్ అంటూ పెట్టారు. అందులో యాంకర్ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలకు సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్. విజనరీ 2047 మీటింగ్ లో ఇంటర్మీడియట్ చెయ్యాలి.. ఇంటర్మీడియట్ లో బైపీసీ చెయ్యాలి అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడాన్ని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.. నీకో దండం ముసలాయనా- నీ మెంటల్ తట్టుకోవడం మా వల్లకాదు😆😆😆 లేదంటే ఇంటర్మీడియట్ లో బైపీసీ ఏంటి సామి అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన నిర్వహించిన చంద్రబాబు విజనరీ 2047 మీటింగ్ కి ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చిందో అనేది ఖాళీ కుర్చీలు చూస్తే తెలిసిపోతుంది. ఆయన పెట్టిన మీటింగ్ ని ఏపీ ప్రజలు లైట్ తీసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్పింగ్స్ చూస్తే చాలు.
రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలని మాట్లాడిన ఆయన తెలివి ఎంత ఉందొ ఈ మాటలతోనే అర్ధమైపోతుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీని, చంద్రబాబు ని ఏపీ ప్రజలు ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీ ని కానీ, చంద్రబాబు ని కానీ ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరంటూ వైసీపీ చెబుతూనే వస్తుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ కి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావు, మళ్ళీ జగన్ ప్రభుత్వంతోనే ప్రజలు కష్టాలు తీరుతాయంటూ వైసీపీ ధీమాతో ఉంది.