వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణ దేవుడు అపార వర్షాలు కురిపించేసాడు. ఏనాడూ చుక్క నీరు జాడలేని వాగులు సైతం పరవళ్లు తొక్కాయి. ఎండాకాలం పూర్తిగా వట్టిపోయి బావురుమన్న బావులు సైతం తల్లికట్టును దాటి నీళ్లు బయటకు తొణికిసలాడాయి. రెండు రాష్ట్రాల్లోని ఏ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెగి ఊళ్లన్నీ నీళ్లపాలయ్యాయని పాలకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని పరిస్థితి కనిపెట్టుకుని ఉన్నారు. అలాంటిది జగనన్న కాలనీల్లో వరదలంటూ పవన్ కళ్యాణ్, జనసేన నేతలు ఎద్దేవా చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.
మహానగరాలు సైతం వరదపాలు
అంతెందుకు భారీ వర్షాలకు మహానగరం హైదరాబాద్ సైతం నీళ్లపాలయింది. లోతట్టు ప్రాంతాల్లో కార్లకు బదులు బోట్లు తిరిగాయి. నీళ్లలో కొట్టుకుపోయిన ప్రజలు ఎందరో.. మూగ జీవాలు ఎన్నో.. మునిగిపోయిన వాహనాలు ఎన్నెన్నో.. ఈ పరిస్థితి అంతా జనసేన నేత పవన్ కళ్యాణ్‌కు తెలియదా? తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పవన్ ఈ పరిస్థితిని చూడలేదా..? రెండేళ్ల క్రితం అపార వర్షాలకు మద్రాస్ నగరం ఏమైంది. అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా పిలిచే ఐటి సిటీ బెంగళూరులో ఏమైంది..? అందాల ఆగ్రాను యమునా చుట్టుముట్టలేదా ? భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా ? గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంకగ్రామాల పరిస్థితి కానరాదా ? మరి ఇప్పటికే రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ రూపొంది సకల సౌకర్యాలతో తులతూగుతున్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీట మునుగుతున్న తరుణంలో ఏమీ లేని సాధారణ లే అవుట్లు నీళ్లతో కాక.. ఇంకేలా ఉంటాయి.?
ఒకసారి కాలనీ రూపొందిన తరువాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు, ఎత్తు చేయడం, విశాలంగా రోడ్లు వేయడం.. కాలువలు వేసి వాననీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది . అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లే అవుట్లో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలవక తప్పదు. అంతెందుకు మీరు ముచ్చటపడి కొనుక్కున్న ఫామ్‌హౌస్ సైతం ఇప్పుడు నీరు నిండిపోయి.. గుంతలు గోతులతోనే ఉంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి మాట్లాడాలి.. బురద ఉన్నది జగనన్న లే అవుట్లలో కాదు.. మీ బుర్రల్లో ఉంది.. ముందు ఆ బురదని శుభ్రంగా కడుక్కోండి.
ప్రజలు సంతోషంగా ఇళ్లు కట్టుకుంటున్న వేళ.. మధ్యలో ఈ వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడింది. ఈ టైమ్‌లో నీ తొట్టి గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఫొటోలు దిగుతూ వాళ్లని బాధపెట్టడమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? నీ దత్తతండ్రి పేదలకి ఇళ్లు ఇవ్వకముందే సెంటు భూమి.. స్మశానం అంటూ వెటకారంతో వారిని అవమానించాడు. ఇప్పుడు నువ్వు. మీరు ఇచ్చేది లేదు.. మెచ్చేది లేదు.. అంటూ వారు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.