Advertisementt

ఏపీలో పెట్టుబడులపై టీడీపీకి సమాధానం

Sat 22nd Jul 2023 01:36 PM
central govt  ఏపీలో పెట్టుబడులపై టీడీపీకి సమాధానం
Central Govt reply to TDP on investments in AP ఏపీలో పెట్టుబడులపై టీడీపీకి సమాధానం
Advertisement
Ads by CJ

రాజ్యసభలో కేంద్రం టీడీపీ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులపై కేంద్రానికి టీడీపీ వేసిన ప్రశ్నకు కేంద్రం పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది. ఆంధ్రాలో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయినాయ్ అట కదా అంటూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ  కనకమేడల రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ సమాధానం ఇచ్చారు. 

2019 అక్టోబర్ - 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి 

2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు 

2021-22 : 224.96 మిలియన్ డాలర్లు 

2022-23 : 284.22 మిలియన్ డాలర్లు 

ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోగా ఆ ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్దికాలం దాటగానే ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడుల వరద మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే సీఎం జగన్ దక్షతకు నిదర్శనం అని చెప్పకనే చెప్పారు. 

మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్నచూపు చూసిన ప్రతిపక్షాలకు అక్కడి సదస్సును, నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు వారికీ కంటి మీదకి కునుకు రాలేదు.

మనం కదా దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తెస్తాం.. ఈ ప్రభుత్వం వాళ్ళ అవన్నీ అయ్యేవా అంటూ ఎత్తిపొడుపు మాటాలన్నవారి కళ్ళలో దుమ్మురేగేలా లక్షల కోట్ల పెట్టుబడులతో సదస్సు ముగిసింది. అంబానీ, అదానీ, బిర్లా, భజంకా ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టీడీపీ వారికి గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లయ్యింది.

విశాఖలో ఏటిజి టైర్ల పరిశ్రమ దగ్గర్నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. ఏడ్చేవాళ్ళు ఏడవనీ... నవ్వేవాళ్ళు నవ్వనీ ... నా గమనం.. పయనం మాత్రం ప్రగతిపథం వైపే అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉంది.

Central Govt reply to TDP on investments in AP:

On Central Govt reply to TDP MP Kanakamedala Questions

Tags:   CENTRAL GOVT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ