ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Complaints on CI Anju Yadav

అంజూ యాదవ్ డ్యూటీ చేసినా తప్పేనా ?

Pawan Kalyan Complaints on CI Anju Yadav

రెండు రోజుల క్రితం జనసేన కార్యకర్తని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ దుందుడుకుగా వ్యవహరించి కొట్టడాన్ని నిరసిస్తూ నేడు తిరుపతిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ధర్నా చేస్తున్న తమ కార్యకర్తను అంజుయాదవ్ చెంపదెబ్బలు కొట్టారు అని చెబుతున్నారు కానీ.. అసలు ఆమె అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో.. ఆ ధర్నాలో అంతమంది ఉండగా ఆవిడ సాయి అనే కార్యకర్తను మాత్రమే ఎందుకు కొట్టారు అనేది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆరోపణలు చెయ్యడం సరయిన పనేనా అంటూ బీసీ సంఘాలు పవన్ పై ధ్వజమెత్తుతున్నాయి. జనసేన కార్యకర్త సాయిపై వెనుకబడిన అంజూ యాదవ్‌కు ఏమైనా కక్షలు కార్పణ్యాలు.. ఆస్థి తగాదాలు ఉన్నాయా.. లేదు కదా మరెందుకు కొట్టారు అనేది పక్కనబెట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ ర్యాలీ చేయడంపై బీసీ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ.. కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా జనసేన కార్యకర్తలు పోలీసుల మీదకి రావడంతో వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో అంజు యాదవ్ సాయి ని చెంపదెబ్బ కొట్టారు. అక్కడ లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్త పరిస్థితిలు ఉన్నా కాస్త సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టడం పవన్ కి తప్పైపోయింది. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ కక్ష కట్టారంటూ యాదవ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. 

అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో తప్పు చేసినవాళ్లు విషయంలో అంతే కఠినంగా ఉంటారని.. ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా.. గొడవకు కారణమైన ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడిన ఆవిడ పై ఇలాంటి విమర్శలు తగునా.. తెలుగుదేశం కార్యకర్తలు అయినా, వైసీపీ నేతలైనా సరే శాంతి భద్రతలకు.. సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించలేని అంజూ యాదవ్ అప్పటికప్పుడే పరిస్థితులు అదుపు చేస్తుంటారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు అంగీకరించడం లేదు. 

మహిళలు స్ఫూర్తిమంతంగా ఉండాలి.. ధైర్యంగా ఉండాలి.. అన్యాయాలను ఎదిరించాలీ అని వాక్రుచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిన్సియర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా బీసీ పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తూ ధర్నా చేయడం సరైన పద్దతి కాదని యాదవ యువత ఆరోపిస్తోంది.

Pawan Kalyan Complaints on CI Anju Yadav at Srikalahasti

pawan kalyan