జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా సీఎం జగన్ ని ఇకపై గౌరవించేది లేదు నిన్ను అని ఏకవచనంతో సంభోదిస్తాను అంటూ మాట్లాడమే కాకుండా నేడు పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రజలకు చేరువైన వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను ఆడబిడ్డల కిడ్నాప్ లకు వాడుకుంటున్న వైసీపీ నేతలు.. అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలోని వాలంటీర్లు భగ్గుమంటున్నారు. వైసీపీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #PawanSaySorryToVolunteers హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారం రోజులకోసారి వారాహి యాత్రకు విరామం ఇచ్చి. ఎక్కడెక్కడో స్క్రిప్ట్ తెచ్చుకుని ఏమేం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అసలు తాను అనే మాటలకు ఆధారం కానీ.. రుజువులు కానీ లేకుండా నోటికివచ్చినట్లు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌గా మారిపోయారు.. ఏపీ అంటూ మంత్రులు పవన్ పై విరుచుకుపడుతున్నారు. కోవిడ్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న సమయంలో ఈ వాలంటీర్లు చేసిన సేవలు నిరుపమానం.. ఇంటింటికి తిరిగి కోవిడ్ రోగులను గుర్తించి సేవలు.. మందులు అందించి వారిని ప్రాణభిక్ష పెట్టిన సేవకులు ఈ వాలంటీర్లు .. అందుకే కేరళ... ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్ర మోడల్‌ను గుర్తించి తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి.
ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలు గుమ్మం ముందే అందించే సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు. వీరు ఇంటింటికి వెళ్లి అమ్మాయిలు, వితంతువుల లెక్కలు తీసి వేరేవాళ్లకు పంపిస్తే వాళ్లొచ్చి వీళ్ళను ట్రాప్ చేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారని అన్నావు.. ఇది నీకు సమంజసమా అంటూ పవన్ కళ్యాణ్ ని తిట్టిపోస్తున్నారు. నువ్వు చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడా .. సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదేమో అందుకే వాలంటీర్లతో 70 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడావు.. అంటూ వాలంటీర్స్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నల్లపురెడ్డి.
ఇంకా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న నిరసనలు:
గ్రామ/వార్డు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన నీచమైన వ్యాఖ్యలను ఖండిస్తూ, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న వాలంటీర్లు
వాలంటీర్స్ పై పవన్ వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయి..పవన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి....ఆళ్ళనాని 🔥🔥🔥
వాలంటీర్స్ పై పపవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న మహిళా వాలంటీర్స్
పవన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...🔥🔥🔥
పవన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి...పవన్ వాలంటీర్స్ కి క్షమాపణ చెప్పాలి...మిథున్ రెడ్డి 👊👊🔥🔥🔥