Advertisementt

సలార్ టీజర్ పై క్రేజీ అప్ డేట్

Mon 19th Jun 2023 07:11 PM
prabhas,salaar teaser  సలార్ టీజర్ పై క్రేజీ అప్ డేట్
Crazy update on Salaar teaser సలార్ టీజర్ పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మాములుగా లేదు. బాహుబలి తర్వాత అన్ని ప్యాన్ ఇండియా సబ్జక్ట్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని.. రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ నిరూపించింది. ఆదిపురుష్ మూవీ శుక్రవారం విడుదలై మూడురోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 340 కోట్ల కలెక్షన్స్ కొల్లకొట్టింది. తర్వాత ప్రభాస్ నుండి రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ఇది కూడా ఈ ఏడాదే సెప్టెంబర్ 28 న విడుదల కాబోతుంది. రెండేళ్లుగా తెరకెక్క్కుతున్న సలార్ నుండి కేరెక్టర్స్ లుక్స్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసారు.. ఇప్పటివరకు సలార్ టీజర్ వదల్లేదు. ఆ విషయంలో ఫాన్స్ సలార్ మేకర్స్ పై కాస్త గుర్రుగానే ఉన్నారు.

ఆదిపురుష్ రిలీజ్ రోజున ఆ థియేటర్స్ లోనే సలార్ టీజర్ వదులుతారని అభిమానులు భావించారు. కానీ ప్రభాస్ ని సలార్ మేకర్స్ డిస్పాయింట్ చేసారు. ఆదిపురుష్ తో పాటుగా సలార్ టీజర్ వదల్లేదు. అయితే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సలార్ టీజర్ పై వినిపిస్తుంది. అది జులై మొదటి వారంలో సలార్ టీజర్ రాబోతుంది.. దాని తర్వాత సలార్ నుండి వచ్చే అప్ డేట్స్ తో ప్రమోషన్స్ పీక్స్ లోకి తీసుకువెళతారు. సెప్టెంబర్ 28 న సినిమా ఖచ్చితంగా విడుదల కాబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది.

సలార్ టీజర్ తో యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని, సలార్ టీజర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో ఉంటుందని.. టీజర్ హైలెట్స్ ఇవే అంటూ రకరకాల ప్రచారాలు షురూ అవుతున్నాయి. ఆదిపురుష్ డిస్పాయింట్ మోడ్ నుండి ప్రభాస్ ఫాన్స్ సలార్ యాక్షన్ టీజర్ తో తేరుకుంటారేమో చూద్దాం.

Crazy update on Salaar teaser:

Juicy update on Prabhas Salaar teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ