Advertisementt

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్?

Sat 17th Jun 2023 10:41 AM
vijay deverakonda,family star!  విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్?
Vijay Deverakonda In And As Family Star? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్?
Advertisement
Ads by CJ

శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమంత తో రొమాన్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ ఖుషి తో సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నిన్న శుక్రవారం నుండి విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న #VD12 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల తో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్. ఇవి కాకుండా రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ లో విజయ్ తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ తో #VD13 మొదలు పెట్టాడు.

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ చిత్రం పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందట. ఈ చిత్రంలో విజయ్ కేరెక్టర్ బలంగా ఉండడమే కాకుండా అవుట్ అండ్ అవుట్ కుటుంభ కథా చిత్రంగానే ఉంటుందని వినికిడి. అందుకే ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట, మరి ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అయితే పక్కాగా సూట్ అవుతుంది మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఖుషి షూటింగ్ చివరికి దశలో ఉండగా.. #VD12 రీసెంట్ గానే మొదలయ్యింది.. కాబట్టి విజయ్ దేవరకొండ పరశురామ్ తో #VD13-గౌతమ్ తో #VD12  షూటింగ్స్ పారలల్ గా చేస్తాడని తెలుస్తుంది. 

Vijay Deverakonda In And As Family Star?:

Vijay Deverakonda to turn as Family Star!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ