లోకేష్ తన పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గమే బలయ్యింది అంటూ రెడ్లపై సంచలన కామెంట్స్ చేస్తున్నాడు.
వైసిపిలో బాగుపడింది వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ ఈ నలుగురు మాత్రమే. 2014-19 లో చంద్రబాబు హయాంలో నలుగురు రెడ్లకు మంత్రి పదవులు కట్టబెట్టారు. అప్పట్లో ఈ ప్రాంతంలో చిన్నచిన్న కాంట్రాక్టర్లు రెడ్డి సామాజికవర్గం వారే ఎక్కువ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో రెడ్లను ఇబ్బంది పెట్టింది..
టీడీపీ 2024 ఎలక్షన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్లకి ఇచ్చిన మాట నెరువేస్తా. జగన్ పాలనలో నష్టపోయింది రెడ్లే, టీడీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదలను ఆదుకుంటాం, రెడ్డి భవన్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చాడు.
అయితే రెడ్ల పై సానుభూతితో ఇలా మాట్లాడుతున్న లోకేష్ ఒకసారి వెనక్కి తిరిగి తన తండ్రి చంద్రబాబు పాలనలో రెడ్లను, రెడ్డి అధికారులను ఎలా వేధించారో ఒక్కసారి చూసుకోవాలి అంటూ వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో మీరు వేదించిన అధికారుల లిస్ట్ ఒక్కసారి చూడండి.. అంటూ పెద్ద లిస్ట్ నే చూపిస్తున్నారు.
YS రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారని అపప్టి విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఉన్న రమాకాంత్ రెడ్డిని ఎలా వేదించారో మర్చిపోయారా?
ఐపీయస్ అధికారిగా సర్వీసులో ఏ మచ్చ లేని డీజీపీ ఆంజినేయ రెడ్డి గారిని కేవలం కుల వివక్ష కారణంగా వేదించి ఆయనను పక్కన పెట్టి రాములు గారికి అవకాశం ఇవ్వలేదా?
ఐపీయస్ అధికారి దినేష్ రెడ్డి ని కూడా కేవలం కుల వివక్షతో నాలుగేళ్ళు పక్కన పెట్టలేదా ?
ఇంతేనా చంద్రబాబు ప్రబ్బుత్వంలో చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని కేసుల్లో ఇరికించి పోలీస్ వ్యానులో కింద పడేసి కిలోమీటర్ల కొద్దీ తిప్పి స్టేషన్లో పెట్టీ కొట్టిన ఘటనను ఆయన శాసన సభలోనే వివరించిన సంగతి మరిచారా ?
ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం మాటున మీరు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. అధికారం కొసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లపై అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదు జనాలు.. అంటూ వైసీపీ నేతలు లోకేష్ మాటలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.