Advertisementt

పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

Thu 08th Jun 2023 05:31 PM
cm ys jagan  పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
The CM kept his promise during the march పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
Advertisement
Ads by CJ

ఐదేళ్ల క్రితం ఆంద్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వైసిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి.. ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఆయన CPS ను రద్దు చేస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ (GPS) వల్ల చాల ప్రయోజనాలు కలగబోతున్నాయి. రాష్ట్ర ఉద్యోగులు కూడా కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (CPS) కన్నా ఇది మరింత మెరుగైన పథకం అని భావిస్తున్నారు. ఈ పథకం పెన్షన్ కు మరింత గ్యారెంటీ కల్పిస్తుంది. ఈ పథకంలో ఒక్కో ఉద్యోగి 10 శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది.

ప్రతి ఉద్యోగి రిటైర్‌ అయ్యేముందు చివరి శాలరీలో బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తారు..

ఉద్యోగం నుండి రిటైర్‌ అయిన వ్యక్తి.. అతను చివరిగా అందుకున్న నెలబేసిక్‌ జీతం1 లక్ష ఉంటే.. అందులో సగం అంటే 50వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్‌లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూ పోతుంది....

62 సంవత్సరాలకు రిటైర్‌ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. రిటైర్‌ అయిన ఆ ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్‌ద్వారా పెన్షన్‌ రూ. 1,10,000 కి చేరుతుంది..

వయసు పెరిగి ఎలాంటి పని చెయ్యలేని వారికి ఈ పథకం ఆసరాగా నిలుస్తుంది.

కానీ సీపీఎస్‌లో ఇలాంటి ఏసులుబాటు లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు ఉభయతారకంగా మేలు జరిగేలా అన్ని రకాల సమతుల్యతను పాటించేలా ఈ నిర్ణయం.

2070 నాటికి ఈ జీపీఎస్‌ పతాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లుకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19.520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్‌ నుంచి భరించాల్సి వస్తుంది.

అలాగే రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వేల మందికి ప్రయోజనం కలిగిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసి, పాలిటెక్నిక్, విద్య, మెడికల్ , వైద్యం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తుండగా వారి పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి వారి సర్వీస్ ని రెగ్యులర్ చేయడం జరిగింది.

The CM kept his promise during the march:

CM YS Jagan kept his promise to the employees in his padayatra

Tags:   CM YS JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ