Advertisementt

మాసివ్ లుక్ తో గుడ్ న్యూస్ చెప్పిన మహేష్

Fri 22nd Apr 2022 07:44 PM
superstar mahesh babu,sarkaru vaari paata,parasuram,keerthy suresh  మాసివ్ లుక్ తో గుడ్ న్యూస్ చెప్పిన మహేష్
It’s A Wrap For Entire Shooting Of Sarkaru Vaari Paata మాసివ్ లుక్ తో గుడ్ న్యూస్ చెప్పిన మహేష్
Advertisement
Ads by CJ

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ గత వారమే పూర్తయినా.. అఫీషియల్ గా సాంగ్ షూట్ తో నేడు ప్యాకప్ చెప్పేసింది టీం. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్‌ లపై  మాస్ సాంగ్ ని చిత్రీకరించారు. దానితో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా మహేష్ బాబు మాసివ్ లుక్ ఉన్న పోస్టర్ తో ప్రకటించారు మేకర్స్. ఆ పోస్టర్ లో మహేష్ బాబు రెండు చేతుల్లో తాళాలు గుత్తితో నుదిటి మీద రక్తపు మరకతో మాస్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విలన్స్ ని చితకబాదే పవర్ ఫుల్ లుక్ అన్నమాట.

మరోపక్క మూడో సింగల్ టైటిల్ సాంగ్ రేపు ఉదయం11:07 గంటలకు విడుదల చేస్తునంట్టుగా టీం ప్రకటించింది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు, కళావతి, పెన్నీ.. ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. దానితో రేపు రాబోయే మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా, ఆతృతగా  ఎదురుచూస్తున్నారు. ఇక చిత్రీకరణ పూర్తవడంతో సర్కారు వారి పాటని మే 12 న రిలీజ్ చేస్తున్నట్లుగా టీం మరోసారి కన్ ఫర్మ్ చేసింది. 

It’s A Wrap For Entire Shooting Of Sarkaru Vaari Paata:

It’s A Wrap For Entire Shooting Of Superstar Mahesh Babu Sarkaru Vaari Paata, Releasing Worldwide Grandly On May 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ