బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ అలియా భట్ - రణబీర్ కపూర్ లు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట విహారయాత్రలకు, పార్టీలకి, ఫంక్షన్స్ కి కలిసే తిరుగుతున్నా పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేసింది. గత ఏడాది పెళ్లి చేసుకుందాం అంటే కరోనా, లాక్ డౌన్ వలన సాధ్యం కాలేదు అని రణబీర్ కపూర్ చెప్పాడు. కరోనా మహమ్మారి తగ్గగానే మా పెళ్లి ఉంటుంది అంటూ చెప్పిన రణబీర్ - అలియా జంట రేపు సాయంత్రం పెళ్లితో ఒక్కటి కాబోతుంది. ఈ రోజు ఉదయమే అలియా - రణబీర్ కపూర్ పెళ్ళికి వినాయకుడి పూజలు నిర్వహించారు ఇరు కుటుంబాల వారు.
ఇక ఈ రోజు సాయంత్రం అలియా - రణబీర్ ల ఎంగేజ్మెంట్ తో పాటుగా సంగీత్ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరి పెళ్ళికి కొద్దిమంది ఫ్యామిలీ మెంబెర్స్ తప్ప అతిధులు కానీ, సెలబ్రిటీస్ కానీ హాజరు కావడం లేదు. ఇక పెళ్లి విషయం కూడా అలియా కానీ రణబీర్ కానీ బయటపెట్టడం లేదు. అంతేకాకుండా పెళ్ళికి వచ్చే స్టాఫ్ ఫోన్ ల కెమెరాలకు రెడ్ స్టిక్కర్స్ అతికించి తమ పెళ్లి ఏర్పాట్లని కానీ, పెళ్లిని కానీ ఏ ఒక్కరూ కవర్ చెయ్యకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అలియా - రణబీర్ పెళ్లి సందర్భంగా ముంబై లోని ఆర్కే స్టూడియో, వాస్తు అపార్ట్మెంట్, కపూర్ ఫ్యామిలీ కి చెందిన కృష్ణం రాజు బంగాళా అన్ని పెళ్లి లైటింగ్ తో వెలిగిపోతున్నాయి.