ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల తో చెయ్యబోయే NTR30 కోసం రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీపై రేపు అప్ డేట్ ఇచ్చి, ఈ నెల 7 న సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా కియారా అద్వానీ కానీ అలియా భట్ కానీ నటించే అవకాశం ఉంది అని చెబుతున్నా.. అలియా భట్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గా ఫైనల్ అంటున్నారు.
అటు అలియా భట్ కూడా ఎన్టీఆర్ తో నటించేందుకు చాలా ఎగ్జైట్ అవుతుందట. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్ అల్లరి, అయన నటనలో డెడికేషన్ చూసిన అలియా ఎన్టీఆర్ తో పని చేసందుకు ఎగ్జైట్ అవుతుంది అంటున్నారు. మరి ఎన్టీఆర్ - అలియా భట్ జోడిగా అంటే పాన్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ రావడం పక్కా. అలాగే కొత్తగా కూడా ఉంటుంది. అందుకే కొరటాల ఇంకా నిర్మాతలు అలియా భట్ కి భారీ పారితోషకం ఇచ్చి NTR30 కోసం కమిట్ చేయించారని అంటున్నారు.