రంపచోడవరం, మారేడుమిల్లు ఫారెస్ట్ లో 20 రోజుల లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని ఆచార్య లో సిద్ధ గా నటిస్తున్న రామ్ చరణ్ వైఫ్ ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆచార్య లో సిద్ద గా రామ్ చరణ్ అండ్ చిరు లు నక్సలైట్స్ గా కనిపించబోతున్నారు. ఆచార్య గా చిరు లుక్ ని ఆచార్య టీజర్ లోనే రివీల్ అయ్యింది. కానీ రామ్ చరణ్ సిద్ద బ్యాక్ లుక్ తప్ప మరో లుక్ బయటికి రాలేదు. మొన్నామధ్యన చిరు ఆచార్య సెట్స్ నుండి రామ్ చరణ్, చిరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి..
ఇక తాజాగా చిరు, రామ్ చరణ్ లు ఓ మైన్స్ గనుల వద్ద ఆచార్య లొకేషన్స్ లో ఉన్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. కొరటాల శివ - చిరు - రామ్ చరణ్ లు లొకేషన్స్ లో ఉన్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మారేడుమిల్లు ఫారెస్ట్ లో రామ్ చరణ్ - చిరు కాంబో సీన్స్ తర్వాత ఆచార్య షూటింగ్ స్పాట్ ఖమ్మం జిల్లాలో ఇల్లేందుకి మారింది. ఇల్లేందులో ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్ మార్చి 15 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే రామ్ చరణ్ కాంబో సన్నివేశాలను కొరటాల ఇల్లేందులోని జెకె మైన్స్‌లోని గనుల వద్ద చిత్రీకరిస్తున్నారు. అక్కడ గనుల్లో షూటింగ్ జరుగుతుంది అని తెలుసుకున్న చాలామంది అభిమానులు షూటింగ్ ప్రదేశానికి చేరుకోగా ఆచార్య యూనిట్ పోలీస్ బందోబస్త్ మధ్యన షూటింగ్ చిత్రీకరణ చేపట్టింది.