నారాచంద్రబాబునాయుడు గారి పుత్రరత్నం లోకేష్ నిన్న వైజాగ్‌లో మాట్లాడుతూ.. చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ను ఎత్తుకుంటే ఏడుస్తున్నాడని, చంద్రబాబు అమరావతిలో ఉంంటుంటే తాము హైదరాబాద్‌లో ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. ఇక జెసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుడూ.. చంద్రబాబు తన మవనడితో కలిసి ఉండలేకపోతున్నాడని, చంద్రబాబు కష్ట జీవి అని, రాష్ట్రాభివృద్దికే ఆయన అన్నీ వదిలి కష్టపడుతున్నాడని చంద్రబాబు సమక్షంలోనే వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ చెప్పిన దానిలోని సారాంశం ఏమిటంటే.. చంద్రబాబు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతున్నాడనేదే.. వారు ఇన్‌డైరెక్ట్‌గా ప్రజలకు చెప్పి సానుభూతిని పొందడమే అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ప్రజలు అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు.. వారి ప్రతి విషయాన్ని విశ్లేషించగలరు. సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన వారు నమ్మరు. అసలు బాబును అమరావతికి వచ్చి ఇక్కడి నుండే పరిపాలన కొనసాగించమని ఎవరు చెప్పారు? పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వదిలి అమరావతికి ఎందుకు వచ్చినట్లు...? ఆయనే ఓటుకు నోటుకి భయపడి అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని భావించి హడావుడిగా అమరావతి వచ్చాడు. పోనీ అమరావతికి వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని కూడా తీసుకొని హైదరాబాద్ నుండి అమరావతికి ఫ్యామిలీని షిఫ్ట్ చేయవచ్చు కదా..! ఇలాంటి అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. అయితే చంద్రబాబు హైదరాబాద్ నుండి అమరావతికి ఎలా వచ్చాడో? ఆయన కుటుంబం మాత్రం ఇక్కడికి రాలేకపోవడానికి స్వార్ధమే తప్ప అందులో త్యాగం లేదంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు కుటుంబసభ్యులకు హైదరాబాద్‌లో అనేక వ్యాపారాలు ఉన్నాయని, అందువల్లే వారు హైదరాబాద్‌ను వదిలి రావడం లేదనేది నగ్నసత్యం, మరి ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా మసిపూసి మారేడు కాయ చేసి చెప్పడం జనాల చెవ్వుల్లో పూలు పెట్టడమే అని స్పష్టంగా అర్దం అవుతోంది.