పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి టీచర్ల నియోజకవర్గంలో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రామకృష్ణ గెలిచారు. దాదాపు 13400 ఓట్లలో రామకృష్ణకు దాదాపు సగం ఓట్టు రావడంతో ఆయన విజయం ఖాయమైంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో శాసన మండలి టీచర్ల ఎమ్మెల్సీకి సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. రామకృష్ణ గెలుపుతో టీడీపీ నాయకులకు కొత్త ఉత్సాహం వచ్చింది.