ఎన్టీఆర్ డ్రాగన్ లో అవే హైలెట్
Those are the highlights in NTR's Dragon
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీపై పాన్ ఇండియా మార్కెట్ లో మంచి అంచనాలున్నాయి. ఎన్టీఆర్ కి భుజానికి తగిలిన గాయంతో రెండు నెలలు షూట్ వాయిదాపడగా.. ప్రస్తుతం డ్రాగన్ షూట్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.
ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేయబోతుంది. అయితే డ్రాగన్ చిత్రం ఎలా ఉండబోతుందో అనేది ఎన్టీఆర్ బర్త్ డే కి ఇచ్చిన టీజర్ తోనే స్పష్టత వచేసింది. అయితే తాజాగా డ్రాగన్ లో కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ గా నిలబోతున్నాయని తెలుస్తుంది.
జైల్లో వచ్చే పార్కర్ ఫైట్, అలాగే GTC కాళీ మాత ఫైట్, బ్లడ్ ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ విత్ విక్టర్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని డ్రాగన్ లో అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ఖచ్చితంగా సినిమాలో ఇది మెయిన్ హైలెట్స్ గా నిలవబోతున్నాయనే వార్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నాయి.
















































