బాలయ్య, చిరు మధ్యలో ప్రభాస్
Prabhas To Join Chiranjeevi on OTT
నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టాక్ షో ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మూడు అద్భుతమైన హిట్ అయ్యాయి. స్టార్స్, పొలిటికల్ లీడర్స్ బాలయ్య షో లో సందడి చేసారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలయ్య షో కి వచ్చారు. ఆ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ టాక్ షోస్ లో కనిపించడం చాలా అరుదు.
పబ్లిక్ ఈవెంట్స్ లోను ప్రభాస్ పెద్దగా కనిపించరు, మొహమాటస్తుడు. అందుకే ప్రభాస్ సరదాగా మాట్లాడితే వినాలని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, చాలామంది వెయిట్ చేస్తారు. బాలయ్య షో లో ప్రభాస్ కనిపించగానే అభిమానులు వెర్రెక్కిపోయారు. ఇక ఇప్పుడు ప్రభాస్ మరో టాక్ షో లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సహాన్ని నింపింది.
అది మెగాస్టార్ హోస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోయే మెగవర్స్ కి ప్రభాస్ ఓ ఎపిసోడ్ కి గెస్ట్ గా రాబోతున్నారట.. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ తో ఓ ఎపిసోడ్ చేసిన చిరు ఇప్పుడు ప్రభాస్ తోనూ ఓ ఎపిసోడ్ చేయబోతున్నారట. దాని కోసం ప్రభాస్ తో మెగవర్స్ టీమ్ చర్చిస్తుంది అని, ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా వున్నారు.
ప్రభాస్ డేట్స్ ని బట్టి చిరు మెగవర్స్ కి ప్రభాస్ వస్తారని తెలుస్తుంది. చూద్దాం చిరు, ప్రభాస్ మధ్య చిట్ చాట్ ఎలా ఉంటుందో అనేది
















































