అనిరుధ్ పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్
Dhanush fans furious with Anirudh
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ కుమార్తె, సన్ రైజర్స్ ఓనర్ కావ్య ను గ్రీస్ వేదికగా వివాహం చేసుకున్నారు. నిన్న సోమవారం అనిరుధ్ రవిచంద్ర తన 15 ఏళ్ళ మ్యూజికల్ జర్నీపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే ఆ నోట్ లో అనిరుద్ ఎక్కడా హీరో ధనుష్ ప్రస్తావన తీసుకురాలేదు.
ధనుష్-అనిరుధ్ మంచి ఫ్రెండ్స్. అయితే తనకు మ్యూజిక్ డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చింది ధనుష్, 3 సినిమాలో వై థిస్ కొలవరి సాంగ్ పాపులర్ కావడంతోనే అనిరుధ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొచ్చింది, ఆతర్వాత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. కానీ అనిరుధ్ మ్యూజిక్ కంపొజర్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా వదిలిన నోట్ లో ఎక్కడా ధనుష్ పేరు ప్రస్తావించలేదు.
అంతేకాదు గ్రీస్ లో జరిగిన తన పెళ్లి కూడా ధనుష్ ని అనిరుద్ ఆహ్వానించలేదు.. సరికదా మ్యూజిక్ డైరక్టర్ గా గుర్తించి అవకాశం ఇచ్చిన ధనుష్ పేరును ఎలా మరిచిపోయాడు అంటూ అనిరుధ్ పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
















































