కాస్మెటిక్ సర్జరీలపై శృతి హాసన్ బోల్డ్ కామెంట్స్!
Shruti Haasan's bold comments on cosmetic surgeries!టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ ఏ విషయంలోనైనా మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ సెలబ్రిటీల కాస్మెటిక్ సర్జరీలు - అందం మెరుగుపరచుకునే పద్ధతులపై ఓపెన్‌గా మాట్లాడారు. కెరీర్ ఆరంభం నుంచి తాను చాలా విషయాల్లో స్పష్టంగా ఉన్నానని.. పబ్లిక్‌గా కనిపించే మార్పులపై అబద్ధాలు చెప్పడం తెలివితక్కువతనమని అభిప్రాయపడ్డారు.
`నేను ఈ విషయాల గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. కానీ అందరి కళ్ల ముందే పెరిగి పెద్దయిన తర్వాత దాని గురించి అబద్ధం చెప్పడం సిల్లీగా అనిపిస్తుంది. నేను ఎవరినీ జడ్జ్ చేయడం లేదు. కానీ కొంతమంది మాత్రం నేను పుట్టుకతోనే ఇలా ఉన్నాను అంటుంటారు. మూడు వారాల ముందే మరోలా ఉన్న వారు అలా ఎలా అంటారు? అంటూ నవ్వుతూనే చురకలంటించారు. ఎవరి ఇష్టం వారిదని.. కాస్మెటిక్ ప్రొసీజర్స్ గురించి పబ్లిక్‌గా అబద్ధాలు ఆడాల్సిన అవసరం అసలు లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీల అందాల వెనుక రకరకాల సందేహాలుంటాయి. చాలా మంది నటీమణులు సహజ అందంతోనే కనిపిస్తారా? మ్యాకప్ కారణంగా అందంగా కనిపిస్తారా? అన్న డిబేట్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇందులో తారలు చెప్పేవి ఏవి నిజాలు..ఏవి అబద్దాలు అన్నది కనిపెట్టడం కష్టమైన వ్యవహారమే.















































