పాన్ ఇండియా స్టార్స్ ఏమైపోయారు
What happened to the pan-India stars?
పాన్ ఇండియా స్టార్స్ అంతా ఏమైపోయారు.. అసలు వాళ్లకు అభిమానులంటే లెక్క లేదా, ఫెస్టివల్స్ ని పట్టించుకోరా అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వారు అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చెయ్యరు, అభిమానుల ముందుకు రారు, కానీ సినిమాలు హిట్ అవ్వాలంటూ అభిమానులను కోరతారు.
ఫెస్టివల్ కి తమ సినిమాల నుంచి ఏమైనా అప్ డేట్స్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాల్సిన పాన్ ఇండియా స్టార్స్ సైలెంట్ గా ఉంటారు అంటూ కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజమే దసరా, దీపావళి ఇలా ఏదో ఒక పండగ కు తమ సినిమాల అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ అప్ డేట్స్ ఇస్తే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు.
కానీ ఈ పండుగలను పాన్ ఇండియా స్టార్స్ లైట్ తీసుకుంటున్నారు, మొహం చాటేశారు. అల్లు అర్జున్ రాక అప్ డేట్ కానీ, మహేష్ వారణాసి అప్ డేట్ కానీ, ఎన్టీఆర్ డ్రాగన్ అప్ డేట్ కానీ, ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ అప్ డేట్స్ కానీ ఇలా ఏ హీరో కూడా దసరా, దీపావళి పండుగలకు సర్ ప్రైజ్ అప్ డేట్స్ ఇవ్వకుండా డిజప్పాయింట్ చేసారు.
అసలే రెండేళ్లకో సినిమా చేస్తున్నారు, అది కూడా చెప్పిన టైమ్ కి సినిమా రాదు, అయినా అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటపుడు ఇలాంటి ఫెస్టివల్స్ కి అప్ డేట్స్ ఇస్తే ఫ్యాన్స్ కి అంతకుమించి ఏం కావాలి అనేది నెటిజెన్స్ వాదన. అది నిజమే కదా.!
















































