వారణాసి రాముడిని చూపించొచ్చుగా?
Mahesh Babu Confirms Playing Lord Rama In Varanasi
ప్రస్తుతం హిందీ రామాయణ హవా ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోను కనిపిస్తుంది. హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామాయణ చిత్రం గత గురువారం విడుదలైంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడి గా యశ్ నటించిన రామాయణ మంచి హిట్ అందుకుంది. ఎవ్వరు చూసినా రామాయణ చూడాలి అంటున్నారు అంటే హిందీ రామాయణపై ఆడియన్స్ లో ఆసక్తి ఉందొ అర్ధమవుతుంది.
అందులోను దివాళి టైమ్ లో రామాయణ విడుదల కావడం మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే హిందీ రామాయణలో రణబీర్ ని రాముడిగా వీక్షించాం, ఎస్ ఎస్ రాజమౌళి వారణాసిలో మహేష్ ని రాముడిగా చూపించనున్నారు. వారణాసిలో రాముడిగా మహేష్ ని ఎప్పడెప్పుడు చూద్దామా అని అభిమానులే కాదు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఈ దీపావళికి వారణాసి నుంచి రాముడిగా మహేష్ లుక్ వదలొచ్చుగా అనేది మహేష్ అభిమానుల కోరిక. ఏప్రిల్ 7 టార్గెట్ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో మహేష్ ని రాముడి గెటప్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని నార్త్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు.
















































