ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vicky Kaushal, Katrina Kaif share first glimpse of son Vihaan on Diwali

దివాళి స్పెషల్: కొడుకుని రివీల్ చేసిన విక్కీ-కత్రినా

Vicky Kaushal, Katrina Kaif share first glimpse of son Vihaan on DiwaliVicky Kaushal, Katrina Kaif share first glimpse of son Vihaan on Diwali


బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ తల్లులుగా మారుతున్నారు. దీపికా పదుకొనె. అలియా భట్, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ ఇలా ఒక్కొక్కరిగా తల్లిగా నిజ జీవితంలో తమ పాత్రని సమర్ధవంతంగా పోషిస్తున్నారు. ఈమధ్యనే దీపికా రెండో పాపకు జన్మనిచ్చింది. కియారా అద్వానీ రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లుగా గుడ్ న్యూస్ చెప్పారు.

కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంటకు గత ఏడాది బాబు జన్మించాడు. అయితే అందరి సెలబ్రిటీస్ లాగే కత్రినా జంట కూడా తమ కొడుకు విహాన్ ను మీడియాకు దూరంగా ఉంచింది. ఇప్పటివరకు అభిమానులకు కూడా విహన్ ని పరిచయం చెయ్యలేదు. ఇప్పుడు దివాళి ఫెస్టివల్ సందర్భంగా కొడుకుని అందరికి పరిచయం చేసారు.

తమ కొడుకుతో ఆనందంగా ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ.. మా జీవితాల్లో అత్యంత ప్రకాశవంతమైన దీపావళి ఇది... అందరికీ ప్రేమ, కాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాం.. అంటూ కత్రినా, విక్కీ కౌశల్ లు సోషల్ మీడియాలో అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Vicky Kaushal and Katrina Kaif shared a family photo featuring their son