ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Suresh on interfaith marriage with Antony

15 ఏళ్ల లవ్ స్టోరీ.. మతాలు వేరైనా గెలిచిన ప్రేమ!

Keerthy Suresh on interfaith marriage with AntonyKeerthy Suresh on interfaith marriage with Antony

నటి కీర్తి సురేష్- వ్యాపారవేత్త ఆంటోని తట్టిల్  తో 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత 2024లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జోడీ ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసుకున్న వెంటనే అనగా 2010 జనవరి నుండి డేటింగ్ ప్రారంభించారు. కీర్తి కాలేజీ రోజుల్లో రాసుకున్న పర్సనల్ డైరీని చదవడం ద్వారా తల్లి, నటి మేనక ఈ ప్రేమ వ్యవసారం గురించి తెలుసుకున్నారు. `నేను మీ అమ్మను. డైరీ చదవగలను` అని తన తల్లి చెప్పినట్లు కీర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన డైరీ రాసే అలవాటును పూర్తిగా మానేయాల్సి వచ్చిందని.. బహుశా తల్లి ఆ డైరీని తగలబెట్టి ఉండొచ్చ‌ని  సరదాగా పంచుకున్నారు.

ఆంటోని క్రిస్టియన్ మతానికి చెందినవారు కావడంతో మ‌తాంత‌ర‌ వివాహం కావడం వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని కీర్తి సురేష్ తెలిపారు. కుటుంబాన్ని వివాహానికి ఒప్పించడానికి కొంత సమయం పట్టిందని పేర్కొన్నారు. అయితే కీర్తి ఇండస్ట్రీలోకి రాకముందే ఆంటోనికి ఆమె తెలుసని, ఇద్దరూ కలిసి ఎదిగామని వెల్లడించారు. ఆరు సంవత్సరాల పాటు లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ చాలా కాలం పాటు ప్రేమను గోప్యంగా ఉంచుకున్న జంట చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటయ్యారు.

సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలిచే కీర్తి సురేష్ ఆంటోనితో బంధం గురించి చాలా కాలం తర్వాత  బహిరంగంగా మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంది. ఆంటోని తనకంటే ఏడేళ్ల పెద్ద‌వారు అయినా? ఇద్దరి మధ్య ఉన్న అవగాహనే ఈ బంధానికి పునాది అని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ ఇటీవల రాధిక ఆప్టెతో కలిసి నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `అక్క` లో కనిపించారు.
 

Keerthy Suresh Says Family Had Problems With Her Interfaith Relationship With Antony