యశ్ చుట్టూ తిరుగుతున్న రామాయణ
The Ramayana revolving around Yash
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకముగా నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ చిత్రంలో కన్నడ స్టార్ హీరో యశ్ రావణ్ పాత్ర పోషించారు. అంతేకాదు యశ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ రామాయణ చిత్రానికి. అయితే రామాయణ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు శ్రీముడి గెటప్ వేసిన రన్బీర్ కపూర్ కి సీత కేరెక్టర్ వేసిన సాయి పల్లవి కి హారతులు, ప్రసంశలు ఇవ్వాలి కానీ..
రామాయణ చిత్రం చూసి ప్రతి ఒక్కరూ రావణ్ గా యశ్ ని పొగడడమే హైలెట్ అవుతుంది. మాములుగా రామాయణ చూసి వచ్చాక అందరూ రావణ్ పాత్రధారిని తిడతారు, అస్యహించుకుంటారు. కానీ బాలీవుడ్ రామాయణ చూసిన ప్రతి ఒక్కరూ రావణ్ గురించి మాట్లాడుతున్నారు, ఆహార్యంలో యశ్ రావణాసురుడు గెటప్ కి సూపర్ గా సూట్ అయ్యారు.
యశ్ రావణ్ కేరెక్టర్ రామాయణ కు మేజర్ హైలెట్, ఆయన పెరఫార్మెన్సు అదుర్స్, రామాయణ చిత్రానికి రణ్బీర్ కపూర్ సినిమా అనుకొని వెళ్లాను. కానీ ఈ రామాయణ చూసిన తర్వాత యష్ నటించిన రామాయణ అని రియలైజ్ అయ్యాను. యష్ డెడికేషన్, విజన్, హార్డ్ వర్క్ చూసిన తర్వాత రణ్బీర్ కపూర్ అభిమానులు కూడా ఈ సినిమాను మెచ్చుకోరు. యష్ నటనకు తలవంచి నమస్కరిస్తున్నాను అంటూ ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
మరి ఈరోజు విడుదలైన రామాయణ చిత్ర సోషల్ మీడియా టాక్ మొత్తం రాముడు చుట్టూ కాదు రావణుడు యశ్ చుట్టూనే తిరిగింది అంటే నమ్మాలి.
















































