ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Makers mesmerize with a global update on Ramayana

రామాయణ గ్లోబల్ అప్‌డేట్‌తో మెస్మరైజ్ చేసిన మేకర్స్

Makers mesmerize with a global update on RamayanaMakers mesmerize with a global update on Ramayana

భారతీయ పౌరాణిక చిత్రం `రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` గురించిన అప్‌డేట్స్ సినిమా వర్గాల్లో  ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక కొత్త బిహైండ్-ది-సీన్స్ ప్రొమోను విడుదల చేశారు. ఈ ఫుటేజ్‌లో చిత్రంలోని విజువల్స్, ప్రధాన తారాగణం లుక్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఈ విజువల్స్‌లో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ సూర్యోదయ వేళ పర్వతంపై నిలబడి ఉన్న దృశ్యం చూపించారు.  యశ్ పోషిస్తున్న రావణాసురుడి పాత్రకు సంబంధించి.. ఆయన శివుడి భారీ విగ్రహం ముందు తాండవ నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న ఘట్టం ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీటితో పాటు జటాయువు పూర్తి రూపం, కునాల్ కపూర్ ఇంద్రుడి పాత్రలో వజ్రాయుధంతో కనిపించడం వంటి ఎపిసోడ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవి సరికొత్తగా కనిపించనున్నారు. విడుదలైన ఫుటేజ్‌లో సాయిపల్లవి సీత పాత్రలో కేవలం సాంప్రదాయకంగా కాకుండా రాక్షసులతో భీకరంగా పోరాడే యోధురాలి అవతారంలో కనిపించ‌డం ఈ వీడియోలో  హైలైట్‌గా నిలిచింది. ఆమె పలికే హావభావాలు, యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ ప్రాజెక్ట్ విశేషాలను పంచుకుంటూ నిర్మాత నమిత్ మల్హోత్రా దర్శకుడు నితీష్ తివారీ, హీరో రణ్‌బీర్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రామాయణం అనేది  ఒక సినిమా కాదని.. అదొక గొప్ప ఎపిక్ అని, ఇందులో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన భావోద్వేగాలు, తండ్రీకొడుకుల బంధం, అందమైన ప్రేమకథ ఉన్నాయని వారు పేర్కొన్నారు.
 

Ramayana: Namit Malhotra announces global promotions