రణబాలి రన్ టైమ్: క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Rahul Sankrityan about Ranabaali runtime
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్ గా రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. దానితో టీం హడావిడిగా సక్సెస్ మీట్ పెట్టేసారు. ఈ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ రణబాలి చిత్రం హిట్ అవడం కోసమో, అలాగే కలెక్షన్స్ చూపించుకోవడం కోసమో తియ్యలేదు, ఈ ఏడాది అంటే 2026 లో రణబాలి బెస్ట్ ఫిలిం అవుతుంది, సినిమా చూసి మా అమ్మ ఏడ్చేసింది, నా స్నేహితులు ఎమోషనల్ అయ్యారు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరోపక్క రణబాలిపై వచ్చిన మెయిన్ కంప్లైంట్ నిడివి. దాదాపుగా ఓ 20 నిమిషాల నిడివి బాగా ఇబ్బంది పెట్టేసింది అంటూ ఆడియన్స్ నుంచి, అలాగే సినిమా సినీవిమర్శకుల నుంచి ఓవరాల్ గా వస్తున్న కామెంట్. మరి ఈ కామెంట్స్ చూసిన దర్శకుడు రాహుల్ రణబాలి సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
వరల్డ్ బిల్డింగ్ కి లెంత్ అవసరం, అందుకే రణబాలి కోసం ఆ రిస్క్ తీసుకున్నాం, అదే అడ్వాంటేజ్ అయ్యింది అంటూ నిడివి అందుకే ఉంచామన్నట్టుగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
















































