ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Harish Shankar Backs Vijay Deverakonda Against Trolls

విజయ్ కోసం నిలబడుతున్నారు

Harish Shankar Backs Vijay Deverakonda Against TrollsHarish Shankar Backs Vijay Deverakonda Against Trolls


కొన్నాళ్లుగా హీరో విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగివిటి కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కి బిల్డప్ తప్ప ,బిజినెస్ తక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటూ ఆయన సినిమాలు రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అవేమి విజయ్ దేవరకొండ పట్టించుకోకపోయినా అయన అభిమానులు బాగా ఫీలవుతుంటారు.

తాజాగా రణబాలి ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ట్రోలింగ్ పై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ ఉంటుంది, వారు కావాలని నెగెటివ్ చేస్తారు, మనం ఫీలైతే ఎట్లా అంటూ లైట్ తీసుకున్నాడు, కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత మాత్రం విజయ్ దేవరకొండ చాలా మంచోడు, ఆయనపై ట్రోలింగ్ ఎందుకు చేస్తారో తెలియదు, అతకంటే మంచోడు లేడు అంటూ విజయ్ కి ఎలివేషన్ ఇచ్చారు.

రీసెంట్ గా రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ ట్రోల్స్ విషయమై మాట్లాడుతూ నన్ను ట్రోల్ చేసినట్టుగా ఈమధ్యన ఎవరినైనా ట్రోల్స్ చేసారా, నాలా ధైర్యంగా ఉండాలి కదా, ట్రోల్స్ అనేవి ఒకరి బాడీ లాంగ్వేజ్‌ను, భాషను టార్గెట్ చేయగలవేమో కానీ, విజయ్ పడే కష్టాన్ని, అంకితభావాన్ని ఎవరూ వేలెత్తి చూపలేరంటూ విజయ్ దేవరకొండకు సపోర్ట్ గా నిలబడ్డారు హరీష్ శంకర్.

Harish Shankar calls Himself the Most Trolled