క్లైమాక్స్ షూట్ లో స్పిరిట్
Spirit readies for the climax shoot
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ అనుకున్న సమయానికే సజావుగా సాగుతుంది అనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్ చెవిలో అమృతం పోసినట్టుగా మారింది. కారణం ప్రభాస్ మూవీస్ అన్ని అనుకున్న సమయానికి రావు అనేది అభిమానుల డౌట్.
తాజాగా స్పిరిట్ చిత్రానికి సంబందించిన క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారట. నవంబర్ మొదటి వారం నుంచి ఈ క్లైమాక్స్ కోసం వేసిన ఓ ప్రత్యేక సెట్ లో ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం దర్శకుడు సందీప్ వంగా కొన్ని స్పెషల్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసారు అని తెలుస్తుంది. ప్రభాస్ పై ఈ సీన్స్ ను షూట్ చేస్తారని సమాచారం.
ప్రభాస్ ని మాసివ్ గా పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ లుక్ లో సందీప్ వంగ చూపించబోతున్నారని, ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఈ నెల 23 న స్పిరిట్ నుంచి అభిమానులు కూడా ఊహించని ట్రీట్ ని సందీప్ రెడ్డి వంగ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.















































