ఆదర్శానికి అచ్చిరాని అక్టోబర్
Aadarsha Kutumbam not releasing anytime
అక్టోబర్ 2 నుంచి వాయిదా వేసి ఓ వారం లేట్ గా అక్టోబర్ 9 డేట్ ని ఫిక్స్ చేసి ఆ తేదీ కి రాలేక చేతులెత్తేసిన ఆదర్శకుటుంబం చిత్రం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్టోబర్ 30 అంటూ డిస్ట్రిబ్యూటర్స్ కి కొత్త తేదీ పై స్పష్టమైన ఆదేశాలు వెళ్ళిపోయినట్లుగా సమాచారం.
అయితే ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఆ డేట్ కూడా రావడం కష్టమనే మాట వినిపిస్తుంది. నిర్మాత నాగవంశీ కూడా ఏం చెయ్యలేక, త్రివిక్రమ్ దగ్గర మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నాడని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఆదర్శ కుటుంబాన్ని వచ్చే నెల అంటే నవంబర్ 20 కి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట.
అందుకే అక్టోబర్ 30 అని అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఆదర్శకుటుంబానికి అక్టోబర్ అచ్చిరాలేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు నవంబర్ 20 కి ఆదర్శం వస్తుందా అనే కామెడీ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో మొదలైపోయాయి.















































