BB10: రోహిత్, షాలిని కి అపూర్వ షాక్
Bigg Boss 10: A huge shock for Rohit and Shalini
బిగ్ బాస్ సీజన్ 10 లో ఐదో వారం ముగిసేసరికి ఆరుగురు వైల్డ్ కార్డు లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దసరా స్పెషల్ గా ఈరోజు ఆదివారం ఈ ఎపిసోడ్ ని ప్రసారం చేయబోతుంది స్టార్ మా. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది.
ఆమె నాగార్జున తో కలిసి స్టేజ్ పైకి కూడా వచ్చేసింది. ఇక రెండో ఎలిమినేషన్ చరణ్. షాలిని, చరణ్ లలో ఎవరో ఒకరిని సేవ్ చెయ్యమని వైల్డ్ కార్డు లకు వదిలేసారు నాగార్జున. దానితో హౌస్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్న చరణ్ ను వైల్డ్ కార్డు లు ఎలిమినేషన్ కి పంపి షాలిని ని సేవ్ చేసారు.
ఇక అపూర్వ హౌస్ లో రోహిత్ తో ఫ్రెండ్ షిప్ చేసి హైలెట్ అవుదామనుకుంది కానీ.. షాలిని రోహిత్ కి అపూర్వని దగ్గర కనివ్వలేదు. అపూర్వ కి హౌస్ లో ఉన్న అందరితో ప్రాబ్లెమే. ఇక స్టేజి పైకి వచ్చాక బిట్టర్ ట్రూత్ లో భాగంగా రోహిత్ నువ్వు పక్కనివాళ్ళను లుక్ డౌన్ చేస్తావ్, ఎదుటి వాళ్ళను అనేటప్పుడు ఆ మాటలు చాలా హర్టింగ్ గా ఉంటాయి అంటూ రోహిత్ కి షాకిచ్చింది.
రామ్ ప్రసాద్ దగ్గర కన్నింగ్ నేచర్ ఉంది అనేసింది. తర్వాత షాలిని కి చెబుతూ.. ఎవరో ఛాన్స్ ఇస్తే దిగినట్టుగా కాదు షాలిని నీ ఛాన్స్ కోసం నువ్వు దిగు అని అపూర్వ అనగానే.. నాగార్జున కూడా ఆల్రెడీ దిగినట్టుగానే ఉంది అంటూ సెటైర్ వేశారు.
















































