BB10: డబుల్ ఎలిమినేషన్ లో వెళ్ళింది ఎవరంటే..!
Charan got eliminated from Bigg Boss 10
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం అంటే ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తుంది. మొదటి వారంలోనే హౌస్ మేట్స్ బయటకు పంపించేసి మళ్లీ రెండో వారంలో బయట ఆడియన్స్ సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చిన చరణ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ తో పాటుగా రోహిత్, నరేష్, షాలిని నామినేషన్స్ లో ఉన్నారు. అందులో చరణ్, అపూర్వ, షాలిని డేంజర్ జోన్ లో కనిపించారు.
అయితే గత రెండు వారాలుగా ఆటలో ఎలా ఉన్నా మాటలతో కీచ్ కీచ్ మంటూ తన గొంతుతో భయపెట్టిన అపూర్వ ని ఆడియన్స్ ఓట్లు వెయ్యకుండా ఎలిమినేట్ చేసారు. మొదటగా ఆదివారం ఎపిసోడ్ లో అపూర్వ ఎలిమినేట్ అయ్యింది. అపూర్వ ఎలిమినేషన్ తో అటు హౌస్ మేట్స్ ఇటు ఆడియన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక రెండో ఎలిమినేషన్ ఎవరంటే.. మొదటి వారం ఇంటికెళ్లి హౌస్ లోకి వచ్చి టాస్క్ లు ఆడకుండా, సోది చెప్పుకుంటూ నెట్టుకొస్తున్న చరణ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. గత వారం చరణ్ ని నరేష్ నామినేట్ చెయ్యగా ఇలానే ఉంటా, పదకొండు వారాలైనా గేమ్ ఆడకుండా ఉంటా అన్న చరణ్ ను ఆడియన్స్ అప్పటివరకు భరించలేమని ఎలిమినేట్ చేసారు.
ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగగా.. ఆరుగురు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు.
















































