ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The dubbed version surpasses the original

ఒరిజినల్ పై డబ్బింగ్ పై చెయ్యి. !

The dubbed version surpasses the original The dubbed version surpasses the original


నిన్న శుక్రవారం అక్టోబర్ 9 న విడుదలైన చిత్రాల్లో శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్, అలాగే డబ్బింగ్ చిత్రం హనుమాన్ అంశ్ చిత్రాలతో పాటుగా మరికొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేసాయి. అందులో శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్,  హనుమాన్ అంశ్ చిత్రాలపై ఆడియన్స్ లో ఆసక్తి కనిపించింది.

కామెడీ జోనల్ లో కామ్రేడ్ కళ్యాణ్ కనిపిస్తే, హిందీలో బ్లాక్ బస్టర్ అయిన రెండు నెలలకు హనుమాన్ అంశ్ తెలుగులో డబ్ అయ్యింది. దానితో ఈ చిత్రం పై ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కామ్రేడ్ కళ్యాణ్ కి విడుదలయ్యాక మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు కామెడీ, సెకండ్ హాఫ్ లో కంటిన్యూ కాలేదు అన్నారు. లాజిక్ లు లేకుండా కామెడీని ఎంజాయ్ చెయ్యగలిగితే థియేటర్స్ కి వెళ్లమన్నారు.

రివ్యూ రైటర్స్ కూడా మిక్స్డ్ రివ్యూస్, 2.5 రేటింగ్ ఇచ్చారు. కామ్రేడ్ కళ్యాణ్ మొదటిరోజు రూ.4 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఇక హిందీ నుంచి ఈ వారమే దిగిన హనుమాన్ అంశ్ చిత్రం పై ఆడియన్స్ నుంచి అలాగే సినీవిమర్శకుల నుంచి ఎబోవ్ యావరేజ్ రెస్పాన్స్ కనిపించింది. ఈ చిత్రము మొదటిరోజు తెలుగులో రూ.4కోట్ల షేర్ తీసుకొచ్చింది.

ఎటు చూసినా స్ట్రయిట్ తెలుగు సినిమా కామ్రేడ్ కళ్యాణ్ తో పోటీపడి డబ్బింగ్ చిత్రం ఎంతోకొంత హనుమాన్ అంశ్ పై చెయ్యి సాధించినట్టుగానే కనిపిస్తుంది. అయితే వీకెండ్ కలెక్షన్స్ ని బట్టి ఒరిజినల్ పై డబ్బింగ్ చిత్రం పై పైచెయ్యి సాధించిందా, లేదంటే ఒరిజినలే గెలించిందా అనేది క్లారిటీ వస్తుంది.

Comrade Kalyan vs Hanuman Ansh