మొన్న టాక్సిక్ ఇప్పుడు జైలర్2 పై ట్రోలింగ్
Jailer 2 is facing trolls
తెలుగులో తెరకెక్కిన సినిమాలకు రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు ముఖ్యమంత్రులను విన్నవించుకుంటే బాగానే ఉంటుంది. మన తెలుగు సినిమాలని మనమే సపోర్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అదే వేరే లాంగ్వేజెస్ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్త్నున్న వాటికి కూడా టికెట్ రేట్ల పెంపు ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు చర్చనీంశం అయ్యింది.
మొన్నటికి మొన్న కన్నడలో తెరకెక్కి తెలుగులో విడుదలైన టాక్సిక్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విషయంలో టాక్సిక్ ని మరియు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అది చూసి అయినా మారకుండా ఇప్పుడు మరోసారి జైలర్ 2 టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని కలిపించారు.
ప్రస్తుతం తెలుగు సినిమాలే టికెట్ రేట్లు పెంచకుండా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించుకోవడానికి తంటాలు పడుతుంటే.. డబ్బింగ్ సినిమాలు వచ్చి టికెట్ రేట్లు పెంచుకుంటామంటే ఎలా, అదే ఆడియన్స్ లో నెగిటివిటి పెరగడానికి కారణమవుతుంది. జైలర్ 2 టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది.
మొన్నటివరకు టాక్సిక్ ని ట్రోల్ చేస్తే... టికెట్ రేట్లు పెంపు విషయంలో జైలర్ 2 ని ట్రోల్ చేస్తున్నారు జనాలు.
















































