ముంబైలో అనుష్క శర్మ బిగ్ డీల్

Anushka Sharma's big deal in MumbaiAnushka Sharma's big deal in Mumbai

బాలీవుడ్  నటి అనుష్క శర్మ - ఆమె కుటుంబ సభ్యులు ముంబైలోని రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. ముంబై వెర్సోవాలోని ప్రఖ్యాత గోద్రెజ్ స్కైషో లో  ల‌గ్జరీ ప్రాజెక్ట్‌లో ఒకే భవనంలో  24వ అంతస్తులో ఏకంగా మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. ఈ మూడు ఆస్తుల మొత్తం విలువ 44.1 కోట్లుగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. అనుష్క శర్మ వ్యక్తిగతంగా ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, దానికి ఆనుకుని ఉన్న మరో ఫ్లాట్‌ను ఆమె తల్లిదండ్రులు (అషిమా శర్మ, అజయ్ కుమార్ శర్మ) తీసుకున్నారు. ఈ రెండు ఫ్లాట్ల కలయిక విలువ సుమారు  25.8 కోట్లుగా ఉంది. వీటితో పాటు అనుష్క శర్మ -ఆమె భర్త, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉమ్మడిగా అదే అంతస్తులో రూ. 18.29 కోట్లతో మూడో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఈ ఫ్లాట్ల స్వాధీనం  2031 జూన్ నాటికి లభించనుంది. ఇప్పటికే అలీబాగ్‌తో పాటు గురుగ్రామ్, ముంబైలలో కోట్ల విలువైన లగ్జరీ ఆస్తులను కలిగి ఉన్న విరాట్-అనుష్క జంట, వెర్సోవా ప్రాంతంలో చేసిన ఈ కొత్త పెట్టుబడి సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 

Anushka Sharma, her parents buy three luxurious flats worth Rs 44.1 cr