ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: This week nomination list

బిగ్ బాస్10: ఈ వారం నామినేషన్స్ లిస్ట్

Bigg Boss Telugu 10: This week nomination listBigg Boss Telugu 10: This week nomination list


ఈ వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ తమ తమ వాలిడ్ పాయింట్స్ పెడుతూనే అరుచుకునే విధానానికి ఆడియన్స్ కూడా ఇరిటేట్ అయ్యుంటారేమో అనేలా ఈ వారం నామినేషన్స్ జరిగాయి. ఎక్కువగా హౌస్ మేట్స్ రోహిత్, ఇంకా అపూర్వ ని కార్నర్ చేసారు. హోస్ట్ నాగార్జున గత వీకెండ్ ఎపిసోడ్ లో రోహిత్ చేసిన పనికి గేట్స్ ఓపెన్ చేసి క్లాస్ పీకారు.

సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ తమను కావాలనే నామినేట్ చేసి పంపించాలనుకుంటున్నారు అంటూ రోహిత్ కామానర్స్ ని గ్రూప్ గా కూర్చోబెట్టి చెప్పడం, నామినేషన్స్ లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ పాయింట్స్ పెట్టడం, ఆ గొడవల్లో అరుచుకుని అరుచుకుని గొంతులు కూడా పోయాయంటే ఈ వారం నామినేషన్స్ ఎలా ఉన్నాయో అర్ధమవుతుంది.

ఇక హౌస్ లో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయినట్లుగా తెలుస్తుంది. దాని ప్రకారం ఐదో వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, షాలినీ, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేషన్‌లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ లెక్కన ఐదో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 

Bigg Boss Telugu 10