బిగ్ బాస్ 10: రోహిత్ బెండు తీసిన సుధీర్
Bigg Boss Telugu 10 : Sudheer vs Rohith
బిగ్ బాస్ సీజన్ 10 లో చాలా సైలెంట్ గా కనిపించే యాంకర్ సుధీర్ ఈ వారం నామినేషన్స్ లో రోహిత్ పై రెచ్చిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. కామనర్ రోహిత్ అన్ని తనకే తెలుసు అని, తన టీమ్ అంతటిని తానె లీడ్ చేస్తున్నాను అనే భావనలో ఉంటాడు. ఇక త్రిగున్ తో గొడవ పడే రోహిత్ సుధీర్ ని పప్పెట్ అంటూ ఏడిపిస్తూ ఉంటాడు.
హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా రోహిత్ తీరులో మారలేదు. ఇక సుధీర్ స్రిష్టి తో గొడవపడి ఆమె ఫ్రెండ్ షిప్ ని దూరం చేసుకున్నాడు. మొదట్లో త్రిగున్ మాట విన్న సుధీర్ తర్వాత త్రిగున్ తో విభేదాలు వచ్చేసి ముఖేష్ తో ఫ్రెండ్ షిప్ మొదలు పెట్టాడు. అయితే ఈ వారం ఇమ్యూనిటితో ఉన్న సుధీర్ రోహిత్ ని నామినేట్ చేస్తూ నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదు అంటూ రోహిత్ ని ఏసుకున్నాడు.
నాగ్ సర్ నాకొక వీడియో చూపించారు, మర్యాద తప్పి టంగ్ లూజ్ అయ్యి మాటలొదిలాడు రోహిత్ అనగానే ఆ మాటలేమిటో చెప్పు అన్నాడు రోహిత్, దద్దమ్మ, చేతకాదు అనే మాటలు అన్నాడు సుధీర్. దానికి రోహిత్ నాకు ఆ మాటలు ఎప్పుడొచ్చాయో తెలియదు అన్నాడు, దానికి మిగతా సెలెబ్రిటీ గ్రూప్ కామెడీగా నవ్వేశారు.
ఈమద్యలో వంశీ కి షాలిని కి గొడవ జరిగింది. రోహిత్ మళ్లీ ఏదో అనేసరికి సుధీర్ కామెడీగా నన్నెప్పుడు బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లో నుంచి పొమ్మనలేదు, నీకు డోర్స్ ఓపెన్ చేసారు అన్నాడు సుధీర్ వెటకారంగా. దానికి రోహిత్ నాకు చెప్పే రేంజ్ లేదు అన్నాడు, దానికి మీ రేంజ్ ఏమిటో చెప్పమన్నాడు సుధీర్. సుధీర్ కి రోహిత్ కి నామినేషన్స్ లో అర్గ్యూ బాగా జరిగింది. అది చూసి సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ నవ్వడమే హైలెట్.
















































