నీచులను వదిలిపెట్టను అంటున్న ఎన్టీఆర్
Jr NTR reacts on AI video of Chuttamalle song
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కోపమొచ్చింది. సోషల్ మీడియా వేదికగా AI ఆధారిత మార్ఫింగ్ ఫొటోస్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను గౌరవించని నీచులను వదిలిపెట్టను అంటూ సీరియస్ అయ్యారు. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని చుట్టమల్లే పాట లోని హీరోయిన్ జాన్వీ కపూర్ ని నీచాతి నీచంగా AIతో మార్ఫింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.
నిజంగా ఇది అత్యంత జుగుప్సాకరమైన చర్య. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే నేల మనది. మాతృదేవోభవ అనే నినాదం మన సంస్కృతిలో భాగమైన చోట.. కొంతమంది వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఒక మహిళను అవమానించేలా AI సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి నీచమైన కంటెంట్ ని క్రియేట్ చేయడం సిగ్గుచేటు.
దేవర చిత్రంలోని చుట్టమల్లే పాట మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచులు ఎవరినీ వదిలిపెట్టను, వారిపై చట్టపరమైన చర్యలు తీసుంటామంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా AI తో మార్ఫింగ్ చేసిన వాళ్ళను హెచ్చరించారు.















































