ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli is the backbone of Don't Trouble the Trouble

రాజమౌళి బ్రాండ్ పవర్ ఎంత?

Rajamouli is the backbone of Don't Trouble the TroubleRajamouli is the backbone of Don't Trouble the Trouble

 

దేశం మెచ్చదగ్గ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన ఏ స్టార్స్ ని ఎంచుకుని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. సౌత్ దర్శకులకు పాన్ ఇండియా మార్కెట్ ని పరిచయం చేసింది రాజమౌళి నే. ఆయన ఈగ తో సినిమా చేసినా హిట్ అవుతుంది. అలాంటి రాజమౌళి బ్రాండ్ పవర్ తెలిసే టైం వచ్చింది.

అంటే రాజమౌళి కొడుకు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు నిర్మించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రం రాజమౌళి హ్యాండ్ నుంచే వస్తుంది. రాజమౌళి సినిమాని వెనకుండి నడిపించడమే కాదు.. ప్రమోషన్స్ లోను కనిపిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో రాజమౌళి ఉన్నారు.

మరి రాజమౌళి బ్రాండ్ నుంచి వస్తున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కి ఆయనతో వర్క్ చేసిన హీరోలైన ఎన్టీఆర్, మహేష్ లు ఆ చిత్రానికి  రివ్యూస్ కూడా ఇచ్చారు. మరి ఈ చిత్రానికి వచ్చే ఓపెనింగ్స్, సినిమా టాక్ అన్ని రాజమౌళి బ్రాండ్ పవర్ తెలిపే ఫిగర్స్ గా ఉంటాయా అనే సందేహాలైతే ఆడియన్స్ లో కనిపించడం లేదు.

ఆ నమ్మకంతోనే ఈ చిత్రానికి మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ వెయ్యబోతున్నారు.  

Rajamouli - Don't Trouble the Trouble