రీతూ-డిమోన్ పవన్ బ్రేకప్
Demon Pavan And Rithu Chowdary Breakup
బిగ్ బాస్ సీజన్ 9 లో లవ్ బర్డ్స్ లో కలిసిపోయి కంటెంట్ అందించిన డిమోన్ పవన్ ఇంకా రీతూ చౌదరిలు హౌస్ లోనే కాదు బయటికి వచ్చాక కూడా మంచి ఫ్రెండ్స్ లాగా, ప్రేమికుల్లానే కనిపించారు. రివాన్ అంటూ ఫేమస్ అయ్యారు. డిమోన్ పవన్ తండ్రి చనిపోయినప్పుడు రీతూ వాళ్ళింటికి వెళ్లడం, ఇద్దరూ కలిసి స్టార్ మా షోస్ లోనే కాదు స్పెషల్ సాంగ్స్ చెయ్యడం, ప్రాజెక్ట్స్ చెయ్యడం అన్ని వారి మధ్యన ప్రేమ బలపడింది, ఇక పెళ్ళే తరువాయి అనే ప్రచారం జరిగింది.
అయితే కొద్దిరోజులుగా డిమోన్ పవన్, రీతూ చౌదరి కలిసి కనిపించడం లేదు, అంతేకాదు సోషల్ మీడియాలోనూ వీరిరువురు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరి మద్యన బ్రేకప్ జరిగింది, అందుకే వారు కలిసి కనిపించడం లేదు అంటూ చర్చ మొదలైంది. దానితో డిమోన్ పవన్ సోషల్ మీడియా వేదికగా ఈ బ్రేకప్ వార్తలను నిజం చేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
రివాన్ గురించి కంటిన్యూగా మెసేజ్‌లు వస్తుండటంతో నేను స్పందిస్తున్నాను. రీతి చౌదరి నేను విడిపోయాము, నేను రీతూని యూస్ చేసుకున్నానా లేదా తను నన్ను ఉపయోగించుకుండా అంటూ జరుగుతున్న ప్రచారంతో విసిగిపోయాను. బిగ్‌బాస్‌లో చూసేది.. నిజ జీవితంలో జరిగేది వేరువేరు. మేం ఎవరినీ ఎవరూ ఉపయోగించుకోలేదు. మాది ఫ్రెండ్‌షిప్ మాత్రమే.
అయితే ఇకపై రివాన్ ఉండదు. మా ఫ్రెండ్‌షిప్ కి బ్రేకప్ అయ్యిపోయింది. ఏ బంధంలోనైనా గొడవలు సహజం. మా మధ్య కూడా గత కొన్నినెలలుగా గొడవలు జరిగాయి. నేనే ప్రతీసారీ చొరవ తీసుకుని సమస్యని పరిష్కరించుకోవాలని చూశాను. కానీ పరిస్ధితి చేయి దాటిపోయింది.. గొడవలు ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలో మా ప్రాజెక్ట్‌లను వేరు వేరుగా చేసుకుంటున్నాం.
రీతూ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి.. స్నాప్‌లోనూ తొలగించింది. అది నాకు నచ్చలేదు.. ఆమెను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాను, ఇప్పుడు ఆమె కూడా నన్ను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. ఇంతకాలం అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ డిమోన్ పవన్ రీతూ ఫ్రెండ్ షిప్ప్ తో బ్రేకప్ అయినట్లుగా కన్ ఫర్మ్ చేసేసాడు.
















































