నాని తో మీను పాప

Meenakshi Chaudhary to Romance Nani?Meenakshi Chaudhary to Romance Nani?


నేచురల్ స్టార్ నాని రీసెంట్ గానే ది ప్యారడైజ్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్యారడైజ్ నుంచి రిలాక్స్ అవ్వగానే నాని సుజిత్ తో కలిసి బ్లడీ రోమియో సెట్స్ లోకి వెళ్ళిపోతారు. నాని-సుజిత్ కలయికలో బ్లడీ రోమియో అనౌన్సమెంట్ ఎప్పుడో వచ్చింది.

మధ్యలో ఈ సినిమా ఆగిపోయింది అనే న్యూస్ నడిచినా ఆ ప్రాజెక్ట్ ఆన్ లోనే ఉంది అని రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రంలో నాని మీనాక్షి చౌదరితో రొమాన్స్ చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నాగ చైతన్య వృషకర్మ లో నటిస్తున్న మీను పాపకు నాని సినిమాలో ఛాన్స్ దక్కింది అంటున్నారు.

ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరుపుకున్న బ్లడీ రోమియో చిత్రం అక్టోబర్ ఎండ్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ ని సుజిత్ కంప్లీట్ చేస్తారట. అందులో భాగంగా నాని కి జోడిగా మీనాక్షి చౌదరి పేరు హీరోయిన్స్ లిస్ట్ లో గట్టిగా వినిపిస్తుంది. 

Meenakshi Chaudhary In Talks To Romance Nani