కల్కి 2 లో దీపికా ప్లేస్ ఖాళీ?
Is Deepika Character Not Getting Replaced In Kalki 2
కల్కి 2 చిత్రం షూటింగ్ రేపు అక్టోబర్ నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది.. అంటూ మేకర్స్ అలా అప్ డేట్ ఇచ్చారో లేదో అప్పటినుంచి కల్కి 2పై బోలేడన్ని కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2 లోకి కొత్త కేరెక్టర్స్ ఏమి ఎంటర్ అవ్వడం లేదు అంటూ చేసిన కామెంట్స్ చూసి సుమతి పాత్రలోకి దీపికా పదుకొనె స్థానంలోకి సాయి పల్లవి ని తీసుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కల్కి పార్ట్ 1 లో సుమతి అంటే దీపికా ప్రెగ్నెంట్ తో కనిపిస్తుంది. ఆమె పాత్ర పార్ట్ 2 లో చాలా కీలకం కానుంది. కానీ దీపికా ను కల్కి 2 ని తప్పించడంతో ఆమె ప్లేస్ లోకి సాయి పల్లవి సహా చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా సాయి పల్లవి ఫైనల్ అన్నారు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ కామెంట్స్ చూసి సాయి పల్లవి కూడా కల్కి 2 లో కనిపించదనే టాక్ మొదలైంది.
మరి కల్కి 2 లో సుమతి పాత్రను ఎలా ఎండ్ చేస్తారు, ఆమె పాత్ర ప్రాధాన్యతను ఎలా తప్పిస్తారు, అసలు సుమతి పాత్ర లేకుండా కల్కి 2 ఎలా సంపూర్ణం అవుతుంది అనేది ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.
















































