కొత్త నటీనటులతో సినిమా.. క్రిష్ అసంతృప్తి?
Krish's GenZ Movie: What's With shooting?దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పూర్తిగా యువ నటీనటుల `జెంజ్ బ్యాచ్` అనూ టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రతిభతో రూపొందుతున్న ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో క్రిష్ పూర్తిగా సంతృప్తిగా లేరని, కొత్త నటీనటుల నుంచి అనుకున్న స్థాయిలో ఎమోషన్స్ పండలేదని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కథనం మరింత గ్రిప్పింగ్‌గా, ఆసక్తికరంగా ఉండేలా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాలని క్రిష్ భావిస్తున్నారట. గతంలో కూడా ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే క్రిష్ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్టార్ హీరోల కంటే కథనే బలంగా నమ్మే దర్శకుడిగా క్రిష్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ చిత్రంలోనూ కమర్షియల్ అంశాలతో పాటు తనదైన శైలిలో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్నారు. మరి కొత్త నటీనటులతో క్రిష్ చేస్తున్న ప్రయత్నం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
















































