ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆశిస్తున్నారేమో?
Perhaps Prabhas's fans are expecting too much?
ఈ ఏడాది డిసెంబర్ 3 న విడుదల కావాల్సిన ప్రభాస్ ఫౌజీ చిత్రం వాయిదా పడింది. కాస్త ఆలస్యంగా రిలీజ్ అన్నప్పటికీ మేకర్స్ సరైన రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మరోపక్క ఫౌజీ రిలీజ్ డేట్ పైనే సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ విడుదల తేదీ ఆధారపడి ఉంది.
మరోపక్క నాగ్ అశ్విన్ అక్టోబర్ నుంచి కల్కి 2 షూటింగ్ అంటూ ప్రకటించేసారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ వరసగా మూడో సినిమాలో నటించేయ్యడం అనేది ఎగ్జైటింగ్ గానే ఉంది. కానీ అనుకున్న తేదీలకు సినిమాల రిలీజ్ లను ఆశిస్తూ భంగ పడుతున్నారు వారు. రాజా సాబ్ ఫలితం నుంచి మళ్లీ పవర్ ఫుల్ గా ప్రభాస్ కమ్ బ్యాక్ ఇవ్వాలని వారి కోరిక.
అది దూరం జరుగుతుంది. అదే వారి బాధ. ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేసాక కల్కి సీక్వెల్ అప్ డేట్ వస్తే వారు మరింతగా ఆనందపడేవారు. అసలు ప్రభాస్ ఫౌజీ ఫినిష్ చేసారా అనే విషయంలో అస్సలు క్లారిటీ లేదు. మరోపక్క ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ లోకి వెళుతున్నారో లేదో అనే అనుమానం. ఇప్పుడు కల్కి 2 అప్ డేట్.
మరి మూడు సినిమాలు అంటే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూడు కూడా ఆరు నెలలు, ఆరునెలలు గ్యాప్ లో తమ ముందుకు వస్తాయని ప్రభాస్ అభిమానులు ఎక్కువ ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది.
















































