ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> IMAX is Back: A Brand-New Wonder Inspired by Mahesh's Suggestion!

ఐమాక్స్ ఈజ్ బ్యాక్: మ‌హేష్ స‌ల‌హాతో సరికొత్త వండర్!

IMAX is Back: A Brand-New Wonder Inspired by Mahesh's Suggestion!IMAX is Back: A Brand-New Wonder Inspired by Mahesh's Suggestion!

హైదరాబాద్‌ సినిమా ప్రియులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు రానే వచ్చింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిర్మిస్తున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ థియేటర్‌లో కొత్త ఐమాక్స్ స్క్రీన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. గతంలో ఈ స్క్రీన్‌ను దసరా లేదా దీపావళి సమయానికి ప్రారంభించాలని భావించినప్పటికీ, నిర్మాణ పనుల దృష్ట్యా  నవంబర్  నాటికి లేదా డిసెంబర్ ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఏషియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ వెల్లడించారు.

ఈ నూతన ఐమాక్స్ స్క్రీన్‌లో ప్రదర్శించబడే తొలి చిత్రాలలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ దృశ్యకావ్యం `డ్యూన్: పార్ట్ 3` ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలోని ప్రధాన ఘట్టాలను ప్రత్యేక ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించడంతో  కొత్త స్క్రీన్ ప్రారంభానికి ఇది సరైన చిత్రంగా నిలవనుంది. అలాగే  ఈ కాంప్లెక్స్‌లో కేవలం ఐమాక్స్ మాత్రమే కాకుండా 4డిఎక్స్  సాంకేతికతతో పాటు ప్రతి స్క్రీన్‌ను విభిన్నమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నట్లు నారంగ్ తెలిపారు.

హైదరాబాద్‌కు తిరిగి ఐమాక్స్ సాంకేతికతను తీసుకురావాలనే ఆలోచన సూపర్ స్టార్ మహేష్  ఇచ్చిన సలహా నుంచే వచ్చిందని సునీల్ నారంగ్ వెల్లడించడం విశేషం. మహేష్  సూచించగానే తాము వెంటనే ప్రయత్నాలు ప్రారంభించామని.. విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, మహేష్   తామందరం కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం చేయి కలిపామని తెలిపారు. ఎస్.ఎస్. రాజమౌళి `వారణాసి` వంటి భారీ చిత్రాలు రాబోతున్న తరుణంలో హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్ అందుబాటులోకి రానుండటం సినీ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Mahesh Babu's theatre to welcome IMAX back to Hyderabad